-విజయవాడ అభివృద్థిలో ముస్లిం సామాజిక వర్గం ముఖ్య భూమిక పోషించింది : ఎంపి కేశినేని శివనాథ్
-నాలుగవ అంతస్తు సిల్క్ డెవలప్మెంట్ సెంటర్ కి కేటాయించటంపై ఎంపీ హర్షం
-ముఖ్యఅతిథులుగా ఎంపి కేశినేని, ఎమ్మెల్యే గద్దె హాజరు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
లబ్బిపేట లోని డాక్టర్ వై.వి.రావు హాస్పటల్ రోడ్ లో జమాఅతే అహ్లె హదీస్ ఆధ్వర్యంలో పున్నర్మిర్మాణం జరిగిన మస్జీద్ లో తొలి నమాజ్, దువా, ప్రత్యేక ప్రార్దన కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరయ్యారు. వీరికి జమాఅతే అహ్లె హదీస్ అద్యక్షుడు నజీర్ అహ్మద్, రాష్ట్ర ఉర్ధూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షిబ్లీ తో పాటు మత పెద్దలు స్వాగతం పలికారు. నాలుగు అంతస్తుల మస్జీద్ భవనాన్ని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పూర్తిగా పరిశీలించారు. అనంతరం మౌలానా హఫీజ్ అబ్దుల్ వహీద్ (ఉమ్రి) మదాని ను ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే గద్దె శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఇంత అందమైన మస్జీద్ ను నిర్మించిన కమిటీ సభ్యులు, నిర్మాణానికి సహకరించిన దాతలకు అభినందనలు తెలిపారు. మస్జీద్ భవనంలోని నాలుగవ అంతస్తు ను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు కేటాయించటం పై హర్షం వ్యక్తంచేశారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అభివృద్ది కోసం మస్జీద్ కమిటీ సభ్యులకు తన సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ముస్లిం, మైనార్టీలు చేపట్టే ప్రతి కార్యక్రమానికి అండగా ఉంటానన్నారు. ముస్లిం సామాజిక వర్గానికి నీతి నిజాయితీకి మాత్రమే కాదు ఇచ్చిన మాటకి కట్టుబడే స్వభావం సొంతమన్నారు. మస్జీద్ లో ప్రార్థనలు మాత్రమే కాకుండా సమాజంతో ఏవిధంగా వుండాలి, ఎదుట వారు చిరాకు పెట్టినా వారిని ప్రేమతో సహనంతో మార్చుకునే విషయాలు బోధిస్తారని పేర్కొన్నారు. ముస్లిం సోదరులకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆ సమస్యను పరిష్కరించేందుకు ఎంపీ కేశినేని శివనాత్ తో కలిసి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జమాఅతే అహ్లె హదీస్ అద్యక్షుడు నజీర్ అహ్మద్, సెక్రటరీ రిజ్వానుల్లా హురేషి, వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ తాజుద్దీన్, ట్రేజరర్ అబ్దుల్ ఖయ్యూమ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ ఫిరోజ్, డివిజన్ అధ్యక్షుడు భాగం సాయి ప్రసాద్, మాజీ సెక్రటరీ అతీ కుర్రహ్మాన్ లతో పాటు మత పెద్దలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News