-రీ-సర్వే ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం -పట్టాదారు పాసు పుస్తకాలు రైతుల కు భరోసా
-ఎంపీ కేశినేని శివనాథ్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వెల్లడి
-సిద్ధాంతంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ప్రారంభం
-రైతులకు పాస్ పుస్తకాలకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాము,విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్
-ప్రజల డబ్బుతో ముద్రించిన పాస్ పుస్తకాలపై…. జగన్ ఫోటోలకు పబ్లిసిటీ చేశారు
-నియోజకవర్గంలో 25వేల మందికి… రాజముద్రతో కూడిన నూతన పాస్ పుస్తకాలు పంపిణీ
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చేతకాని పాలనతో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సరి చేస్తుంది. రీ-సర్వే ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించటంతో పాటు రాజముద్రతో అందించే పట్టాదారు పాసు పుస్తకాలు రైతుల కు భరోసా కలిగిస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గత ప్రభుత్వం తప్పులతో ముద్రించిన పాస్ పుస్తకాల స్థానంలో…. రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు..
గుడివాడ మండలం సిద్ధాంతం గ్రామంలో రీ సర్వే గ్రామసభ కార్యక్రమం శుక్రవారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా భూమి యజమాన్యపు హక్కు మరియు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని రైతులకు నూతన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రైతులకు వారి భూమిపై హక్కును స్పష్టంగా నిర్ధారించే పట్టాదారు పాసు పుస్తకాలు అందించటం సంతోషంగా వుందన్నారు. గత ప్రభుత్వం వ్యవస్థలను గందరగోళానికి గురిచేసి రైతులను అయోమయంలో పడేసిందని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రీ-సర్వే ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, భవిష్యత్‌లో రైతులు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు సులభంగా పొందేందుకు ఈ పాసు పుస్తకాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ… గత పాలకులు వ్యవస్థలను ఎలా నాశనం చేశారో అందరికీ తెలుసన్నారు. ప్రజల ఆస్తులపై మహాత్మా గాంధీ మాదిరిగా జగన్ ఆయన ఫోటోలను ముద్రించుకొని, ప్రజాధనంతో పబ్లిసిటీ చేసుకున్నారని మండిపడ్డారు.
భూ యజమానుల ఫోటోలతో కూడిన పాసు పుస్తకాలను కూటమి ప్రభుత్వం పంపిణీ చేయడం మంచి కార్యక్రమం అని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను రైతులు ఎంతో ఆనందంగా తీసుకుంటున్నారని ఎమ్మెల్యే రాము అన్నారు. ఒక్క గుడివాడ నియోజకవర్గంలోనే 25వేల పాసు పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, నేటి నుండి ఈ నెల 9వ వరకు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్యే రాము చెప్పారు. రైతాంగం ఆనందపడేలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే రాము ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గుడివాడ ఆర్డీవో బాలసుబ్రమణ్యం జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, మండల టిడిపి అధ్యక్షుడు వాసే మురళి, టిడిపి నాయకులు చేకూరు జగన్మోహన్రావు, లింగం ప్రసాద్, గొర్రపత్తి సుబ్బారావు, MRO కిరణ్ కుమార్, గ్రామ నాయకులు ఇస్తా శ్రీనివాసరావు, వీరవరపు ఏసుబాబు, అడుసుమిల్లి గోపాలకృష్ణ, అడుసుమిల్లి లక్ష్మణరావు, సురేష్, కోరుమిల్లి స్వామి, మదిరి సుబ్బారావు, కటారి రాంబాబు, ఇస్సా కృష్ణమూర్తి, బాజీ, కోటిలింగం, పలువురు రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News