Breaking News

ఉద్యోగుల, వారి కుటుంబ సభ్యుల స్మార్ట్ హెల్త్ కార్డులు ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే ఇక నుండి ఆన్లైన్లో పొందవచ్చు…

-ఇక నుండి ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల స్టేటస్ ఆన్లైన్లో తెలుసునేలా ప్రభుత్వం చర్యలు…
-ఇ.హెచ్.యస్ ద్వారా ఉద్యోగులకు, పెన్షర్లకు అన్ని యన్.ఏ.బి.హెచ్ ఆసుపత్రుల్లో క్యాష్ లెస్ ట్రీట్ మెంటు అందేలా చర్యలు తీసుకోవాలి.
-బొప్పరాజు వెంకటేశ్వర్లు & పలిశెట్టి దామోదర్ రావు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపి లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షర్లు కు సంబందించిన ఆరోగ్యభద్రతను కాపాడవల్సిన ఎంప్లాయీస్ హెల్తు స్కీమ్(ఇ.హెచ్.యస్) ద్వారా ఉద్యోగులకు, పెన్షనర్లకు మెరుగైన వైద్యసేవలు అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని, అందుకు సంబందించి ఆగస్టు 2025 వరకు పెండింగ్లో ఉన్న అన్ని మెడికల్ రీయింబర్స్మెంట్ క్లైములు క్లియర్ చేసినట్లు సీఈఓ, ఈ.హెచ్.ఎస్ (ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్) తెలియజేశారు.

మిగిలిన అన్ని క్లైములను వీలైనంత త్వరగా పరిష్కరించి పెండింగు బిల్లులు వెంటనే చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, గతంలో 14 నెలలు గా మెడికిల్ బిల్లులు పెండింగు ఉంటే ప్రస్తుతం 2025 ఆగస్టువరకు ఉన్న పెండింగు బిల్లులు క్లీయర్ చేసామని, ఇకపై ఇ.హెచ్.యస్ కు సంబిందించిన మొత్తం సమాచారం మెడికల్ రీయింబర్స్మెంట్ కేసుల యొక్క స్టెటస్ ను అంతా ఉద్యోగులకు వాట్షాఫ్ ద్వారా వారి వారి సెల్ఫోన్లకు మెసెజ్ ఇస్తామని, అలాగే ఆన్లైన్ పోర్టర్ లో కూడా సమాచారం ఉంచుతామని త్వరలో ఎలాంటి పెండింగు లేకుండా అఫ్ డేట్ చేసేందుకు కృషిచేస్తున్నామని యన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్టు సి.ఇ.ఓ కె.ధీనేష్ కుమార్, ఐఎఎస్ తెలిపారనీ తెలియజేశారు.

ఇ.హెచ్.యస్ ద్వారా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఉద్యోగులకు, పెన్షర్లకు ఇ.హెచ్.యస్ పర్మిషన్ ఉన్న అన్ని ఆసుపత్రులలో ప్రత్యేకంగా యన్.ఏ.బి.హెచ్ ఆసుపత్రుల్లో క్యాష్ లెస్ ట్రీట్ మెంటు అందించేలా చర్యలు తీసుకోవాలని ఏపిజేఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేసారు.

శుక్రవారం యన్టీఆర్ హెల్తు ట్రస్టు ఆఫీసులో ట్రస్టు సి.ఇ.ఓ కె.దీనేష్ కుమార్ (ఐఏయస్) ఆద్వర్యంలో ఇ.హెచ్.యస్ వలన వచ్చే ఇబ్బందులు పైన, అలాగే గతంలో తేదిః15-07-2025 న జరిగిన సమావేశం నుండి నేటి వరకు ఇ.హెచ్.యస్ స్కీమ్ పై ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అలాగే నాటి మిటింగు నుండి నేటి వరకు జరిగిన పురోగతిపై జాయింటు స్టాఫ్ కౌన్సిల్ లో బాద్యులైన ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో సీఈఓ తెలియజేశారు.

అలాగే, ప్రభుత్వం ఉద్యోగుల జీతాల నుండి ఈ హెల్తు స్కీమ్ కోసం రికవరి చేసిన డబ్బులు తో పాటు ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగు గ్రాంటు కలిపి సుమారు రూః 300 లు ఇ.హెచ్.యస్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన డబ్బులు ప్రతినెలా చెల్లించాలని డబ్బులు చెల్లించని కారణంగానే ఆసుపత్రుల యాజమాన్యాలు ఇ.హెచ్.యస్ కార్డులపై వైద్యం అందించడంలేదని తెలిపారు.

అంతే కాకుండా ఉద్యోగుల ఆరోగ్య భత్రత కాపాడే బాద్యతను ప్రభుత్వం తీసుకొని ఇ.హెచ్.ద్వారా మెరుగైన వైద్యం అందించేలా చూడాలని, ఇన్సురెన్సు కంపెనీల ద్వారా వైద్యం అందించాలన్న ఆలోచనలను విరమించుకొని ప్రభుత్వం ద్వారానే మంచి వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని బొప్పరాజు కోరారు.

ఈసమావేశంలో ఏపి ప్రభుత్వ డ్రైవర్సు అసోషియేషన్ రాష్ట్రఅధ్యక్షులు సంసాని శ్రీనివాసరావు, క్లాష్- iv ఎంప్లాయీస్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యస్.మల్లేశ్వరరావు, ఆర్టీసి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు, ఏపీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లవ కుమార్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకట రాజేష్ తో పాటు ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *