Breaking News

అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి ద్వారా స్కాలర్ షిప్ ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నిరుపేదలైన మరియు ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ,మైనార్టీ, ఈ బీసీ కాపుల విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా స్కాలర్షిప్ ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలి అని ప్రజా సత్తా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు పులగర శోభన్ బాబు కోరారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉచిత విదేశీ విద్యా పథకం అందించుటకు గాను 2014 ,2019 మధ్య అంబేద్కర్, ఎన్టీఆర్ పేర్లతో టీడీపీ ప్రభుత్వం 3326 మందికి 318 కోట్ల రూపాయలను 2022లో జగనన్న విదేశీ విద్యా పథకం ద్వారా వైసీపీ ప్రభుత్వం 408 మంది విద్యార్థులకు 107.7 కోట్ల రూపాయలను కేటాయించడం అభినందనీయం అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా గతంలో రెండు సంవత్సరములకు రెండు విడుతలగా 12 లక్షల రూపాయలు ఫీజులు అందించడం జరిగిందని, ప్రస్తుతం మూడో సంవత్సరం చదువుతున్నందున ఫీజు బకాయిలకు వార్నింగ్ లెటర్లు పొందిన వారికి తక్షణమే బకాయిలు చెల్లించాలని మిగిలిన మూడు సంవత్సరాలకు స్కాలర్ షిప్ లు మంజూరు చేయాలని కోరారు .నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ద్వారా ఎంబీబీఎస్ మూడో సంవత్సరం విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలి ఉచిత విదేశీ విద్యను నూతన పాలసీగా విదేశీ విద్య ఆర్థిక రుణాలను4% వడ్డీతో 14 ఏళ్లకు కట్టే వెసులుబాటు కల్పించాలని కోరారు. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ పొందిన వారికి పూర్తి ఉచిత విదేశీ విద్య ద్వారా స్కాలర్ షిప్ రవాణా, విసా, మరియు అన్ని సౌకర్యాలతో పాత స్కాలర్ షిప్ విధానమే కొనసాగించాలని కోరారు. పాదయాత్రలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు నీ కలిసినప్పుడు విదేశీ విద్యా స్కాలర్షిప్ ను ఇస్తామని అప్పుట్లో 60 మంది విదేశీ విద్య చదువుతున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు కలిసిన సందర్భంగా తెలిపినట్లు పులకర గుర్తు చేశారు.. విదేశాలలో ఎంబిబిఎస్ (డాక్టర్ ) కోర్సు కు క్యూ పాయింట్ ఎస్ ఎడ్యుకేషన్ వరల్డ్ ర్యాంకింగ్ ద్వారా ఎంపికైన విద్యార్థులు ప్రస్తుతం కజకిస్థాన్ దేశంలోని ఆల్ఫ రాభి యూనివర్సిటీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలకు ఫీజు బకాయిలు చెల్లించకపోతే పరీక్షలు హాజరు కానివ్వమని వారికి ఆ వార్నింగ్ లెటర్ ఇచ్చినట్లు,శోభన్ బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రుల లో షేక్ షబానా, (నెల్లూరు) మాట్లాడుతూ నిరుపేదలమైన మాకు రాష్ట్ర ప్రభుత్వం పిల్లల చదువులు మధ్యలో ఆగిపోకుండా బకాయిలు చెల్లించి, మా బిడ్డల చదువులు కొనసాగించుటకు రాష్ట్ర ప్రభుత్వం సహాయపడాలని కోరారు. షేక్ మౌలాలి (తాడేపల్లి) మాట్లాడుతూ విద్యార్థులు ఫీజులకు అప్పులు చేసి వడ్డీలు కట్టలేక కొత్తగా పుట్టక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని కన్నీటి పర్యంతమయ్యారు. అదేవిధంగా విద్యార్థులు తల్లిదండ్రులు మాట్లాడుతూ దూర దేశాలలో చదువుతున్న మా పిల్లలు మరియు ఇక్కడ ఉన్నటువంటి మేము ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా, ఆరోగ్యంగా ఇబ్బందులు పడుతున్నామని, తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *