– అన్ని రంగాల్లోనూ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్ణాంధ్ర @ 2047 సాధన దిశగా చేస్తున్న ప్రయాణంలో ప్రతి శాఖకు చెందిన ప్రగతి సూచికల్లో పురోగతి కనిపిస్తోందని.. ఇదే విధంగా నియోజకవర్గాల దార్శనిక ప్రణాళికలపై ప్రత్యేక దృష్టిపెట్టి సమగ్ర కార్యాచరణతో ముందడుగు వేయాలని సమన్వయ శాఖల అధికారులు, దార్శనిక ప్రణాళికల యూనిట్ల యంగ్ ప్రొఫెషనల్స్‌కు కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
మంగళవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్‌లో కలెక్టర్ లక్ష్మీశ కీలక ప్రగతి సూచికలు (కేపీఐ)తో పాటు నియోజకవర్గాల దార్శనిక ప్రణాళికల అమలు తీరుతెన్నులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్టాడుతూ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల విజన్ ప్లాన్ యూనిట్ల ద్వారా ఆయా నియోజకవర్గాలు అన్ని రంగాల్లోనూ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కృషిచేయడం జరుగుతోందన్నారు. గౌరవ శాసనసభ్యుల భాగస్వామ్యంతో ఈ యూనిట్లు క్రియాశీలంగా వ్యవహరిస్తూ ప్రగతిని పరుగులు పెట్టించాలన్నారు. ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి.. యూనిట్ల పరితీరును సమీక్షించుకుంటూ ముందడుగు వేయాలన్నారు. సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించి 563 కీలక ప్రగతి సూచికల్లో సూచికలు వారీగా మండలాల వారీగా స్కోర్లు, గ్రేడ్లపై సమీక్షించారు. కొన్ని శాఖలు కొన్ని సూచికల్లో ఇంకా బీ, సీ గ్రేడ్లలో ఉన్నాయని.. పటిష్ట ప్రణాళికతో సమన్వయంతో ఇవి ఏ, ఏ ప్లస్ గ్రేడ్ కు చేరేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో సీపీవో వై శ్రీలత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News