Breaking News

ది యంగ్మెన్స్ ముస్లిమ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ది యంగ్మెన్స్ ముస్లిమ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ శనివారం విజయవాడ ఏలూరు రోడ్డు అరండల్ పేట లోని షాదీ ఖానా లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపులో యునాని హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ 30 సంవత్సరాల అనుభవం కలిగిన హకీమ్ డా. ఎం. ఖలీలుల్లా పేషెంట్లకు వైద్యం చేశారు. అనంతరం ఖలీలుల్లా మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజల కోసం అందరికీ అందుబాటులో ఉండే విధంగా పూర్తిగా ఉచిత కన్సల్టేషన్ కల్పిస్తున్నట్లు తెలియజేశారు. తమ హాస్పటల్ యొక్క స్పెషాలిటీ సర్జరీ అవసరం లేకుండా గుండెలో ఏర్పడిన బ్లాక్ లను మందుల ద్వారా తగ్గించి రోగుల యొక్క ఆయుష్షుని పెంచి ఆర్థిక భారాన్ని తగ్గించడం అని తెలియజేశారు. అదేవిధంగా రక్తంలో చక్కెర శాతం, మరియు రక్తపోటు చెకప్లు పూర్తిగా ఉచితం అని అన్నారు. మందులపై 10 శాతం తగ్గింపు ఇస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ది యంగ్మెన్స్ ముస్లిమ్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి. షఫీ, సభ్యులు అబ్దుల్ రహీం. అంజద్ హుస్సేన్, ఎండి. రఫీ, ఆయుబ్ ఖాన్, మహమ్మద్ రఫీ, ఎండి. జావిదుల్లా పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *