Breaking News

నగరంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ధర్నా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాల విద్యలో మాతృభాషా మాధ్యమం అమలు చేయాలని ఉమ్మడి సర్వీసు రూల్స్ కు ప్రత్యామ్నాయం అమలు చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు కే నరహరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆంధ్రప్రదేశ్ డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలోధర్నా చౌక్ లో ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షులు కే. నరహరి, ప్రధాన కార్యదర్శి ఎన్వి. రమణయ్య, వర్కింగ్ జనరల్ సెక్రటరీ ఎన్. శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారే. కృష్ణ  తదితరులు పాల్గొని మాట్లాడుతూ ఉపాధ్యాయ రంగంలో విద్య రంగంలో అనేక విధానపరమైన సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, వెంటనే వాటిని పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాఠశాల విద్యలో మాతృభాషా మాధ్యమం అమలు చేయాలన్నారు. విద్య రంగంలో ఉపాధ్యాయ రంగంలో అనేక సమస్యలు పరిష్కరించలేదన్నారు. తెలుగు మాధ్యమం అమలు విషయంలో కూటమి ప్రభుత్వం తన హామీ నిలబెట్టుకోలేకపోయిందన్నారు. ప్రజలకు ఉపయోగము లేని పి పి టి విధానాన్ని విరమించుకోవాలని, విద్యను ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉంచాలని, కనీసం 30% మధ్యంతర భృతిని ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల డిటిఎఫ్ నాయకులు, సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *