Breaking News

విజయవాడ భవాని ద్వీపానికి పర్యాటకుల తాకిడి

-శనివారం సందర్శించిన సుమారు 4500 మంది పర్యాటకులు
-కృష్ణానదిలో బోటు షికారు,స్పీడ్ బోటు సౌకర్యంతో రోజు రోజుకు పెరుగుతున్న పర్యాటకులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ కృష్ణానది నడుమున గల భవానీ ద్వీపానికి రోజు రోజుకు సందర్శకుల తాకిడి పెరుగుతోంది.రాష్ట్ర ప్రభుత్వం భవానీ ద్వీపాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దడంతో రోజు రోజుకు అక్కడకు వెళ్ళే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. శనివారం భవానీ ద్వీపాన్ని సుమారు 4500 పర్యాటకులు సందర్శించారు. భవానీ ద్వీపాన్ని సందర్శించిన వారిలో సాధారణ పర్యాటకులు 4వేల 100 మంది కాగా స్పీడ్ బోటులో వెళ్ళి సందర్శించిన వారు 212 మంది కాగా వారిలో 11 మంది విఐపిలు కూడా ఉన్నారు‌. అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతున్న నేపధ్యంలో రాబోయే రోజుల్లో భవానీ ద్వీపానికి మరింత ప్రాముఖ్యత పెరిగి జాతీయ అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *