Breaking News

నేడు(ఆదివారం) ఒడ్డే ఓబన్న జయంతి

-అనంతపురంలో రాష్ట్ర స్థాయి జయంత్యోత్సవం
-హాజరుకానున్న మంత్రి సవిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నేడు(ఆదివారం) రేనాటి వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న జయంత్యోత్సవం రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నారు. జయంతి నిర్వహణకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అనంతపురంలో రాష్ట్ర స్థాయి జయంత్యోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. గతేడాదే వడ్డే ఓబన్న జయంతి నిర్వహణకు శాశ్వత జీవో జారీచేసింది. దీనిలో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఓబన్న జయంతిని ఆదివారం నిర్వహించనున్నారు. అనంతపురంలో రాష్ట్ర స్థాయి జయంత్యోత్సవ నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నగరంలోని సప్తగిరి సర్కిల్ లలిత కళాపరిషత్ లో జరిగే వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమంలో మంత్రి సవిత హాజరుకానున్నారని ఆ ప్రకటనలో మంత్రి కార్యాలయం తెలిపింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *