Breaking News

ఈ–స్పోర్ట్స్ రంగం యువతకు విస్తృత అవకాశాలు కల్పిస్తోంది…

-ఆసియా పసిఫిక్ ప్రెడేటర్ లీగ్–2026 గ్రాండ్ ఫైనల్స్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నిర్వహించిన ఆసియా పసిఫిక్ ప్రెడేటర్ లీగ్–2026 గ్రాండ్ ఫైనల్స్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ–స్పోర్ట్స్ రంగం యువతకు విస్తృత అవకాశాలు కల్పిస్తోందని, ఆంధ్రప్రదేశ్‌లో ఈ–స్పోర్ట్స్ అభివృద్ధికి దీర్ఘకాలిక దృష్టితో కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆసియా పసిఫిక్ ప్రెడేటర్ లీగ్ వంటి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు యువతకు ప్రేరణనిస్తూ భారత ఈ–స్పోర్ట్స్ సామర్థ్యాన్ని చాటుతున్నాయని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *