Breaking News

సరస్ మేళా కు కొనసాగుతున్న ప్రజల రద్దీ

-డ్రై ఫ్రూట్ వ్యాపారం, డీపీఆర్ ల తయారీ పై శిక్షణ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థిక సాధికారతకు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నల్లపాడు రోడ్డులో  రెడ్డి కళాశాల సమీపంలో జరుగుతున్న సరస్ మేళా అఖిలభారత డ్వాక్రా బజార్ కు గురువారం ప్రజల రద్దీ కొనసాగింది. ఉదయం నుంచే ప్రజలు ప్రజలు పెద్ద ఎత్తున మేళాలు సందర్శించి, వస్తువులను కొనుగోలు చేశారు. సాయంత్రం ప్రజల సంఖ్య మరింతగా పెరిగింది. దేశవ్యాప్తంగా విభిన్న రాష్ట్రాల నుంచి వచ్చిన స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారుచేసిన ఉత్పత్తులు నాణ్యతతో ఉండటంతో ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నగర ప్రజలతోపాటు , పరిసర గ్రామాల ప్రజలు, సమీప జిల్లాల ప్రజలు కుటుంబ సమేతంగా, ఇరుగుపొరుగు వారితో కలిసి మేళాను సందర్శిస్తున్నారు. మేళా ప్రాంగణాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచటం, మంచినీరు అందుబాటులో ఉండటంతో సందర్శికులు జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తున్నారు. ఎంమ్యూజ్మెంట్ పార్కులో పిల్లలు ఎంజాయ్ చేస్తుండగా, ఫుడ్ కోర్ట్ లో విభిన్న ప్రాంతాల ఆహార పదార్థాలను రుచి చూస్తున్నారు.

డ్రై ఫ్రూట్ వ్యాపారం, డీపీఆర్ ల తయారీ పై శిక్షణ
మేళా లోని శిక్షణా కేంద్రంలో గురువారం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లడఖ్ నుంచి వచ్చిన రాష్ట్ర కోఆర్డినేటర్ రజీయ బెటల్ డ్రై ఫ్రూట్స్ వ్యాపారం, ప్రాసెసింగ్ చేసి ఇతర ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ అవకాశాలపై స్వయం సహాయక సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు. పరిశ్రమల శాఖ డిఆర్పి రామయ్య స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ( డీపీఆర్) తయారు చేసుకుని విధానమును, ప్రభుత్వం రాయితీతో అందించే రుణాలకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ గురించి తెలియజేశారు. అదేవిధంగా స్వయం సహాయక సంఘాలు తయారు చేసుకున్న ఉత్పత్తులను ఈ కామర్స్ లో మార్కెటింగ్ ఉన్న అవకాశాలు, ప్రయోజనాలను, దీనికి వాల్ మార్ట్ అందిస్తున్న ప్రోత్సాహకాలను ఫ్లిప్ కార్ట్ ప్రతినిధి ప్రసాద్ తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *