Breaking News

జనవరి 23, 24, 25 తేదీలలో “శుభే ఆంధ్రాకే ఖురానోకా దీనీ ఇజ్తెమా”

-ఇస్తేమా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి..!

వైయస్ ఆర్ కడప, నేటి పత్రిక ప్రజావార్త :
జనవరి 23, 24, 25 తేదీలలో జిల్లాలో జరగనున్న రాష్ట్ర స్థాయి “శుభే ఆంధ్రాకే ఖురానోకా దీనీ ఇజ్తెమా” కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్ల ను చేస్తున్నామని జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి  ఎస్.సవిత పేర్కొన్నారు

మంగళవారం వైయస్ ఆర్ కడప జిల్లా… సికె దిన్నె మండలం కొప్పర్తి పారిశ్రామిక వాడ లో జనవరి 23, 24, 25 వ తేదీలలో నిర్వహించే ఇస్తేమా కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్ల పై జిల్లా ఇంచార్జి మంత్రి మరియు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత,రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఎన్.ఎం.డి ఫరూక్,జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్,కమలా పురం శాసన సభ్యులు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి..లతో కలిసి అధికారులు, కార్యవర్గ సభ్యులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్బంగా జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి  ఎస్.సవిత మాట్లాడుతూ… మైనార్టీ సోదరులు నిర్వహిస్తున్న ఇస్తేమా కార్యక్రమం ను మైనార్టీ సోదరులు ఎంతో నిజాయితీగా, సేవాభావంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని,ఇది చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ కలిసి చేసుకునే అతి పెద్ద మైనార్టీ పండుగ గా ఈ ఇస్తేమా ఉంటుందన్నారు. గౌ. ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం ను అత్యంత ప్రాధాన్యత గా తీసుకొని,ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ఆదేశించారని, ఈ నేపథ్యంలో కలెక్టర్, ఎస్పీ స్థానిక శాసనసభ్యులు పలుమార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించారనన్నారు..ప్రభుత్వం అన్ని విభాగాల ద్వారా అవసరమైన వసతులు, త్రాగునీరు, రోడ్లు, వైద్య శిబిరాలు, అంబులెన్సులు ఏర్పాటు చేసిందని.100 పడకల ఆసుపత్రి, 350 మంది పారిశుధ్య కార్మికులు, బస్సు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారని,మైనార్టీలను గౌరవించే కూటమి ప్రభుత్వం సహకారంతో ఈ కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేయాలన్నారు

ఈ సందర్భంగా రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ మంత్రి మాట్లాడుతూ.. గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మైనారిటీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు.మూడు రోజులు పాటు జరిగే ఇస్తేమా కార్యక్రమానికి ఆంధ్రా, తెలంగాణ నుండి కూడా పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు రావడం జరుగుతుందనన్నారు. ముఖ్యంగా ఇస్తేమా కార్యక్రమానికి సంబంధించి రోడ్ మ్యాపు, త్రాగునీరు, విద్యుత్, మెడికల్,ట్రాఫిక్, బందోబస్తు,ఫైర్ సేఫ్టీ, బ్యారికెట్స్ వంటి తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఇస్తేమా కార్యక్రమం ప్రశాంత వాతావరణం లో జరగడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలనన్నారు

జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ…

ఇస్తేమా కార్యక్రమ నిర్వహణ కు ఇది వరకే తీసుకున్న నిర్ణయం ప్రకారం అందరూ అంగీకరించిన ప్రణాళిక ను అనుసరించి వివిధ రకాల పనులను చేపట్టడం జరిగిందని,ఈ పనులు దాదాపుగా పూర్తయ్యాయని మిగిలిన పనులను బుధవారం లోపు పూర్తి దశకు చేరుకునే స్థితిలో ఉన్నాయన్నారు ముఖ్యంగా ఏపీఐఐసీ ఆధ్వర్యంలో రోడ్డు పనులు, ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారా త్రాగునీటి సరఫరా, ట్రాన్స్‌కో ద్వారా విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కమిటీకి సహకారంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 4 తాత్కాలిక ఆసుపత్రులు, 4 అంబులెన్సులు ఏర్పాటు చేసి,డాక్టర్లు అందుబాటు లో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.అలాగే తాత్కాలిక మరుగుదొడ్ల నిర్వహణ తో పాటు భద్రత కోసం సీసీ కెమెరా లను కూడా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని తెలిపారు

జిల్లా ఎస్ పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ…

ఇస్తేమా కార్యక్రమ నిర్వాహకులతో పోలీస్ శాఖ సమన్వయంతో సెక్యూరిటీ మరియు సేఫ్టీ ప్లాన్‌ను రూపొందించడం జరిగింది. ఇందులో ట్రాఫిక్ సెక్టార్ నుంచి రూట్ క్లియరెన్స్ వరకు సెక్టర్ వారీగా విభజించి ప్రణాళిక అమలు చేయబడుతుందనన్నారు.. సమావేశం నిర్వహించే ప్రాంతాన్ని భద్రత మరియు సురక్షిత దృష్టి కోణంతో నిర్వహించడంతో పాటు, పార్కింగ్ స్థలాలను కూడా పూర్తిగా ఎంపిక చేయడం జరిగిందని, అదే విధంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి, క్రౌడ్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను అమలు చేస్తామని తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ నందు ట్రాన్స్‌కో, వైద్య ఆరోగ్య శాఖ, ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది ఎప్పటికప్పుడు అందు బాటులో ఉంటారని తెలిపారు.

కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి మాట్లాడుతూ… కమలాపురం నియోజకవర్గ పరిధిలో ఇస్తేమా కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషమని, ఈ కార్యక్రమ నిర్వహణలో ఎక్కడ కూడా ఎలాంటి ఆవంచానీయ సంగటనలు జరగ కుండా ఎవరికి అంతరాయం జరగకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నామన్నారు.కలెక్టర్ గారు సంబంధిత అధికారులతో కమిటి ఏర్పాటు చేశారని,నేను కూడా అందుబాటులో ఉంటాము అని, గౌ.ముఖ్యమంత్రి గారి తరపున నుండి మాకు ఆదేశాలు అందాయన్నారు. ఈ కార్యక్రమాన్ని మా కమలాపురం నియోజక వర్గంలో ఏర్పాటు చేసిన కమిటి వాళ్ళ అందరికి కూడా ధన్యవాదాలు తెలిపారు

ఈ సమీక్ష లో డి ఆర్ ఓ విశ్వేశ్వర నాయుడు,కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప ఆర్డీవో జాన్ ఐర్విన్, ఏపి ఐఐసి జెడ్ఎం శ్రీనివాస మూర్తి,డిపివో రాజ్యలక్ష్మి, ఏపీఎస్పీడిసిఎల్ ఎన్ఈ రమణ,ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్ఈ ఏడుకొండలు, ఆర్ అండ్ బి ఎస్ఈ చంద్ర శేఖర్,నాయకులు బిటెక్ రవి,అమీర్ బాబు, తదితర అధికారులు, కమిటీ కార్యవర్గ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *