Breaking News

మొదటిసారిగా దక్షిణ మధ్య రైల్వేలో ‘‘త్రిశూల్‌’’ రైళ్లు ప్రారంభం…

-ఒక్కో దానిలో 58 బాక్స్‌ వ్యాగన్లు గల మూడు గూడ్స్‌ రైళ్లను జతపరిచి, మొత్తం 176 వ్యాగన్లతో ఒకే పొడువాటి గూడ్స్‌ రైలుగా నడుపబడిరది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణ మధ్య రైల్వే తన వినియోగదారుల ప్రయోజనార్థం మరో ప్రత్యేక చొరవ తీసుకొని మొదటిసారిగా తన పరిధిలో మూడు గూడ్స్‌ రైళ్లను జతపరిచి ఒక పొడవాటి గూడ్స్‌ రైళ్లుగా నడిపించింది. మూడు రైళ్లను ఒకే రైలుగా నడిపిస్తున్న దీనికి ‘‘త్రిశూల్‌’’ అని పేరు పెట్టారు. దీన్ని విజయవాడ నుండి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చివరి స్టేషన్‌ అయిన దువ్వాడ వరకు నడిపించారు.
ఈ వినూత్న పద్థతితో గూడ్స్‌ రైళ్ల నిర్వహణలో వేగం పెరగడంతో ఖాళీ వ్యాగన్లు లోడిరగ్‌ పాయింట్‌కు తక్కువ సమయంలో చేరుతాయి. ఇది వినియోగదారుల లక్ష్యాలను నెరవేర్చడంలో ఎంతో తోడ్పడుతుంది. ఉదాహరణకి బొగ్గు కోసం పవర్‌ హౌసులలో ఉండే భారీ డిమాండ్‌ను తీర్చవచ్చు. ఇది క్రమంగా వ్యాగన్‌ ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. దీంతో ప్రతి లోడిరగ్‌ అవసరానికి తక్కువ సమయంలోనే ఖాళీ వ్యాగన్లు అందుబాటులో ఉంటాయి.
మూడు రైళ్లను జతచేసి ఒక రైలుగా చేయడంతో పనిచేసే సిబ్బంది సంఖ్య కూడా తగ్గుతుంది, దీంతో వారిని రైళ్ల రద్దీ మార్గాలలో ఇతర రైళ్ల నిర్వహణలో వినియోగించుకొనే వెసులుబాటు కలుగుతుంది. మూడు రైళ్లు ఒకే రైలుగా నడపడంతో సెక్షన్లో ఇతర రైళ్ల నిర్వహణకు మార్గం సులభమవుతుంది. ఇవి ప్రధానంగా నిరంతరం గూడ్స్‌ మరియు ప్రయాణికుల రైళ్లు నడిచే విజయవాడ`-విశాఖపట్నం వంటి కీలక సెక్షన్లలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
ఈ పద్దతిలో రైళ్ల నిర్వహణతో కలిగే మరో ప్రయోజనం రైళ ్ల మార్గంలో రద్దీని తగ్గించవచ్చు. దీని ఫలితంగా, రైళ్ల రాకపోకల నిర్వహణలో సామర్థ్యం మరింత మెరుగవుతుంది. దీంతో, రైళ్ల సగటు వేగంలో అభివృద్ధి మాత్రమే కాకుండా సెక్షన్ల మధ్య ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. నేటి ఈ రైలు విజయవాడ నుండి దువ్వాడ వరకు సుమారుగా గంటకు 50 కి.మీల సగటు వేగంతో ప్రయాణించింది. 176 వ్యాగన్లను కలిగున్న ఈ రైలు సరుకు వినియోగదారుల లోడిరగ్‌ అవసరాల కోసం నడుపబడిరది.
విజయవాడ నుండి ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేలోని వాల్తేర్‌ డివిజన్‌ వరకు భారీ ‘‘త్రిశూల్‌’’ గూడ్స్‌ రైలు నిర్వహణలో కృషి చేసిన విజయవాడ డివిజన్‌ అధికారులను మరియు సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య అభినందించారు. భారీ పొడువాటి రైళ్లు సరుకు రవాణాలో అత్యుత్తమంగా తోడ్పడుతాయని మరియు తక్కువ సమయంలో పెద్దఎత్తున సరుకులను రవాణా చేయడంలో అవి ప్రయోజనకరంగా కూడా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటువంటి రైళ్ల నిర్వహణతో జోన్‌లో సరుకు రవాణా మరింత అభివృద్ధి చెందుతుందని మరియు రైల్వే వారికి, సరుకు రవాణా వినియోగదారులు ఉభయులకు ఇది ప్రయోజనకరమని ఆయన అభిప్రాయపడ్డారు.

Check Also

మార్చి నాటికి మరొక 50వేల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయటానికి లక్ష్యాలను నిర్దేశించాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తిచేశామని వచ్చే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *