Breaking News

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి భారీ విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతిలో నిర్మించనున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి ఎన్ఆర్ఐ, డాక్టర్ సూరపనేని వంశీకృష్ణ, డాక్టర్ ప్రతిభ దంపతులు భారీ విరాళం ఇచ్చారు. పల్నాడు జిల్లా, అమరావతి మండలం, అత్తులూరు గ్రామానికి చెందిన ఈ దంపతులు సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ మేరకు రూ.1 కోటి చెక్కును అందించారు. పేదల వైద్యం కోసం పెద్ద మనసుతో ముందుకొచ్చిన వంశీకృష్ణ, ప్రతిభ దంపతులను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు. రాజధాని అమరావతి నిర్మాణంలోనూ ఎన్ఆర్ఐలు పాలుపంచుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ చెక్కును హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ గారికి సీఎం చంద్రబాబు గారు తన చేతుల మీదుగా అందజేయనున్నారు. సీఎంను కలిసిన వారిలో డాక్టర్ ప్రతిభతో పాటు ఆమె తండ్రి నూతలపాటి సురేంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యులు, ఇంకా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *