Breaking News

ఘనంగా జిల్లా స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలు

-జనవరి 26న ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ
-“ప్రజలకు జిల్లా ప్రగతిపై సందేశం ఇవ్వనున్న ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 26న రాజమహేంద్రవరం లోని స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జిల్లా స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్. కృష్ణ నాయక్, అదనపు ఎస్పీ ఎల్. చెంచు రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఇంచార్జి జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ జాతీయ జెండాను ఆవిష్కరించి, జిల్లా ప్రగతిపై ప్రజలకు సందేశం ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
ముందస్తు ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన శనివారం సాయంత్రం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జెండా ఆవిష్కరణ వేదిక, అతిథుల గ్యాలరీ, పరేడ్ మైదానం, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.
పోలీసు రిహార్సల్స్, శకటాల ప్రదర్శన, స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పోలీసు పరేడ్ రిహార్సల్స్‌ను క్రమబద్ధంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే స్టాల్స్, వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించే శకటాల ప్రదర్శన ఆకట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలు మరింత వైభవంగా, ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఇతర సమన్వయ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *