Breaking News

నగరంలో తొలిసారి జిల్లా స్థాయి గణతంత్ర వేడుకలకు ముస్తాబైన ఐ.జి.ఎం. స్టేడియం….

-రాష్ట్రస్థాయి వేడుకలు అమరావతిలో ఘనంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం…
-ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా తొలి గణతంత్ర వేడుకలు….
-ఐ.జి.ఎం. స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్న జిల్లా యంత్రాంగం…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి గణతంత్ర దినోత్సవము స్వాతంత్ర దినోత్సవము రాష్ట్ర స్థాయి వేడుకలను రాష్ట్ర ప్రధాన కేంద్రంలోను జిల్లా స్థాయి వేడుకలను జిల్లా ప్రధాన స్థానంలో నిర్వహించేవారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వేడుకలను హైదారాబాద్లోను జిల్లా స్థాయి వేడుకలను కృష్ణాజిల్లా ప్రధాన కేంద్రమైన మచిలీపట్నంలో నిర్వహించేవారు.

రాష్ట్ర స్థాయి వేడుకలను ఇప్పటివరకు విజయవాడ నగరంలో నిర్వహించేవారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి జిల్లా స్థాయి వేడుకలను నిర్వహించే అవకాశం రాలేదు. ఇటీవల కాలంలో రాష్ట్ర రాజధాని అమరావతి లో నిర్మాణ కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో అమరాపతి పేరును జాతీయస్థాయిలో బ్రాండింగ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా గణతంత్ర దినోత్సవ అమరావతిలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రస్థాయి రిపబ్లిక్ డే ఉత్సవాలు అమరావతిలో ఈనెల 26న అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర యంత్రాంగం సమాయత్తమైంది. తొలిసారిగా జిల్లాస్థాయి గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కేంద్రమైన విజయవాడలో జరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అద్భుతమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో సోమవారం నిర్వహించనున్న గణతంత్ర వేడుకలలో జిల్లా అభివృద్ధిని సూచించే విధంగా 18 శకటాలను వేడుకలలో ప్రదర్శించేందుకు సిద్ధం చేశారు, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మిశ ముఖ్య అతిధిగా తొలిసారిగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్రజలు పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లా చరిత్రలో ఒక గొప్ప కార్యక్రమంగా నిలిచిపోయేలా నిర్వహించేలా వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారుల సమన్వయంతో స్టేడియం లో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.

ఉత్సవాలు విజయవంతం చేసేందుకు అవసరమైన ప్రతి అంశాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా, ఆర్డీవో కావూరి చైతన్య ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ఉదయం 8.30 నిమిషాల నుంచి ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో గణతంత్ర ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఉ.8.66 నిమిషాలకు సగర పోలీస్ కమీషసర్ ఎస్.వి. రాజశేఖర్బాబు ప్రాంగణానికి చేరుకుంటారు. ఉ 9.00 గంటలకు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ప్రాంగణానికి చేరుకుని జాతీయ పతాకాన్ని అవిష్కరిస్తారు. అనంతరం ఉ.9.30 నిమిషాల వరకు వివిధ కంటింజెంట్ నుండి పోలీసుల గౌరవ వందనాలను స్వీకరిస్తారు. ఉ.10.00గంటలకు జిల్లా కలెక్టర్ గణతంత్ర దినోత్సవ సందేశం అందిస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి వివిధ శాఖలలో ఉత్తమ సేవలు అందిస్తున్న జిల్లా స్థాయి అధికారులు ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేస్తారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *