గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 30న ప్రభుత్వ వైద్యశాలలో నూతన భవన ప్రారంభోత్సవానికి వచ్చే అవకాశం ఉన్నందున, సదరు పర్యటన మార్గంలో రోడ్లపై గోతులు ఉండకుండా ప్యాచ్ వర్క్స్, డ్రైన్ల శుభ్రం, ఆక్రమణల తొలగింపులో జిఎంసి అధికారులు సమన్వయంతో 2 రోజుల్లో పూర్తి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. ఆదివారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుండి నగరంపాలెం వైపుగా జిజీహెచ్ వరకు విభాగాధిపతులతో కలిసి పర్యటించి, తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన జరిగే పెరేడ్ గ్రౌండ్ నుండి జిజీహెచ్ వరకు పారిశుధ్యం, ఆక్రమణల తొలగింపు, ప్యాచ్ వర్క్ లు చేపట్టడానికి, పర్యవేక్షణకు విభాగాధిపతులు, డిప్యూటీ కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేయాలని అదనపు కమిషనర్ ని ఆదేశించారు. ప్రదానంగా డ్రైన్లు శుభ్రం చేయాలని, సెంట్రల్ మీడియన్స్, ఐలాండ్స్ శుభ్రంగా ఉంచాలన్నారు. చాలా ప్రాంతాల్లో నిర్మాణ వ్యర్ధాలను గమనించామని, వాటిని తొలగించాలని సిటి ప్లానర్ ని ఆదేశించారు. పర్యటనలో సిటి ప్లానర్ రాంబాబు, ఎస్ఈ వెంకటేశ్వరరావు, ఈఈ సుందర్రామిరెడ్డి, వేణు గోపాల్, ప్రజారోగ్య, ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News