Breaking News

ఐకమత్యంతోనే నగరాభివృద్ది సాధ్యం – రాయన భాగ్యలక్ష్మి, నగర మేయర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలందరికీ స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం అందించింది మన రాజ్యాంగ్యం – డాక్టర్ డి చంద్రశేఖర్, ఇంచార్జ్ కమిషనర్
ప్రజలు, అధికారులు, ప్రజా ప్రతినిధుల ఐకమత్యంతోనే నగరాభివృద్ది సాధ్యమన్నారు విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి. సోమవారం ఉదయం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాన కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు, ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు, తదుపరి నగర మేయర్ విజయవాడ నగర పాలక సంస్థ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎన్సిసి, ఆర్మీ, నేవీ, ఎయిర్విన్, దళాల విద్యార్థుల గౌరవ వందనాన్ని నగర మేయర్ ఇన్చార్జ్ కమిషనర్ స్వీకరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఐకమత్యంతో నగరాభివృద్ధి సాధ్యమని, ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రం జీవించడానికి కల్పించిన రాజ్యాంగం జనవరి 26, 1950 నుండి అమల్లోకి రావడం వలన మనము గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. వేడుకలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ప్రజలకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు . గణతంత్ర దినోత్సవం కేవలం వేడుకలకు మాత్రమే కాదని, మన రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను గుర్తుచేస్తుందని అన్నారు. విజయవాడ నగరానికి వచ్చిన సూపర్ స్వచ్ లీగ్ అవార్డు ఎంతో గర్వించదగ్గ విషయమని, ఇది కేవలం అందరి సహకారం తోనే జరిగిందని అన్నారు. విజయవాడ ఇలాగే దినదిన అభివృద్ధి జరగాలని అన్నారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజలందరికీ స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం, ఉండాలని, ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులతో సాధికారత కల్పిస్తుందని, ఇది మనమందరం గౌరవించవలసిన రోజుని, భారతదేశం విభిన్న సంస్కృతులు, భాషలు, మతాలు శాంతియుతంగా సహజీవనం చేసే అపారమైన వైవిధ్యభరితమైన దేశమని, గణతంత్ర దినోత్సవం మనకు భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తు చేస్తుందని, ప్రతి పౌరుడు సామరస్యంతో జీవించడానికి మన రాజ్యాంగం పునాది వేసిందని, ఈ వైవిధ్యాన్ని స్వీకరించి ఐక్యమైన, సంపన్నమైన భారతదేశం కోసం కృషి చెయ్యాలని అన్నారు. తదుపరి నగరపాలక సంస్థ అభివృద్దలతో పొందుపరాచిన నగరపాలక సంస్థ టేబుల్ టాప్ క్యాలెండరు ఆవిష్కరించారు. తదుపరి వివిధ విభాగాల్లో గల ప్రతిభవంతులకు ప్రతిభ పురస్కారాలు అందించారు మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శైలజ, టిడిపి ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి, సిపిఐ ఫ్లోర్ లీడర్ సత్తిబాబు, కార్పొరేటర్లు అంబడిపూడి నిర్మల కుమారి, పుప్పాల నరసకుమారి, ఉమ్మడి వెంకటేశ్వరావు, పడిగపాటి చైతన్య రెడ్డి, నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ (జనరల్) ఎ. రవీంద్ర రావు, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జున రావు, చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్న కుమార్, చీఫ్ ఇంజనీర్ i/సి పి. సత్యకుమారి, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీధర్, ఎస్ ఈ వర్క్స్ చంద్ర శేఖర్, పి ఒ (యూసీడి ) పి. వెంకట నారాయణ, జోనల్ కమిషనర్ కె. షమ్మీ, అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *