Breaking News

బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం గొల్లపూడిలోని బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ జెండా ఎగరవేసి దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ దేశహితం కోసం ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా సమాజానికి న్యాయం, గౌరవం, అభివృద్ధి అందించడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వికసిత్ భారత్ సంకల్పాన్ని స్ఫూర్తిగా తీసుకొని, రాష్ట్రం–దేశం అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో దేశ బలానికి, సమాజ ఐక్యతకు ప్రజలందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *