Breaking News

Tag Archives: gollapudi

ఇరిగేషన్‌పై జగన్‌కు మాట్లాడే నైతిక హక్కు లేదు… : మాజీ మంత్రి దేవినేని ఉమా

-ఐదేళ్లలో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పనులు చేస్తుంటే ఓర్వలేక విమర్శలు గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : రైతాంగం, సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఐదేళ్ల పాలనలో ఇరిగేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేసి, కీలక ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన జగన్‌రెడ్డి.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని …

Read More »

లోకేష్‌కు పేరొస్తుందనే అక్కసుతోనే పారదర్శకంగా జరిగిన డీఎస్సీపై వైసీపీ దుష్ప్రచారం: మాజీ మంత్రి దేవినేని ఉమా

-పట్టిసీమపై ఒక్క మంచి మాట చెప్పలేని జగన్‌.. డీఎస్సీపై నీతులు చెబుతున్నారా? -పట్టిసీమ నీళ్లతో జరిగిన మేలుకు.. చంద్రబాబుకు జగన్‌ కృతజ్ఞత చెప్తూ ట్వీట్ చేయాలి గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. మంత్రి నారా లోకేష్‌కు మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతోనే అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించిన మెగా డీఎస్సీపై ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. గొల్లపూడి లోని కార్యాలయంలో …

Read More »

గొల్లపూడిలో లిటిల్ మిలీనియం స్కూల్ ప్రారంభం

గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో నూతనంగా ఏర్పాటు చేసిన లిటిల్ మిలీనియం చిల్డ్రన్ ప్లే స్కూల్‌ను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పాఠశాల యాజమాన్యం (సూర్య యాదవ్, హేమ దంపతులు) ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ని శాలువా పుష్ప గుచ్చాలతో ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ లిటిల్ మిలీనియం వంటి సంస్థలు ఆధునిక …

Read More »

బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం గొల్లపూడిలోని బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ జెండా ఎగరవేసి దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ దేశహితం కోసం ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా సమాజానికి న్యాయం, గౌరవం, అభివృద్ధి అందించడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వికసిత్ భారత్ సంకల్పాన్ని స్ఫూర్తిగా తీసుకొని, …

Read More »

ఏ.ఎం.సి చైర్మన్ గా నర్రా వాసు ప్రమాణ స్వీకారం

-2029లో కూడా కూటమి ప్రభుత్వానికి అధికారమే లక్ష్యంగా అందరూ పనిచేయాలి -జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని శాశ్వతంగా తరిమికొట్టాలి -ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కొలుసు పార్థసారథి  -పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు, ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : 2029లో కూడా ఎన్డీఏ కూటమికి అధికారమే లక్ష్యంగా కూటమి కుటుంబ సభ్యులందరూ ఐకమత్యంగా ఉండి, జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని శాశ్వతంగా తరిమికొట్టాలని రాష్ట్ర గృహ నిర్మాణం మరియు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి …

Read More »

రాష్ట్రంలో వెల్లివిరిస్తున్న సంక్రాంతి శోభ : ఎంపి కేశినేని శివ‌నాథ్

-గొల్ల‌పూడి లో ఘ‌నంగా భోగి వేడుక‌లు -వేడుక‌ల‌కి ముఖ్యఅతిథిగా ఎంపి కేశినేని హాజ‌రు -బోగి మంట‌లు వెలిగించిన ఎంపి కేశినేని, ఎమ్మెల్యే వ‌సంత ఇబ్ర‌హీంప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గ‌త ఐదేళ్లలో రాష్ట్రంలో క‌నిపించ‌ని సంక్రాంతి శోభ ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జలంద‌రిలో క‌నిపిస్తుంద‌ని…గ్రామీణా ప్రాంతాల‌తో పాటు పట్ట‌ణ ప్రాంతాల్లో కూడా సంక్రాంతి శోభ వెల్లివిరిస్తుంద‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. ఇబ్ర‌హీం ప‌ట్నం మండ‌లం గొల్ల‌పూడి వ‌న్ సెంట‌ర్ లో సోమ‌వారం ఉద‌యం తెల్ల‌వారుజూమున నిర్వ‌హించిన భోగి …

Read More »

వైసీపీ నుంచి గొల్లపూడిలో టీడీపీలోనికి భారీగా చేరికలు

-టీడీపీలో చేర్చుకున్న మైలవరం తెదేపా కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఉదయం తెలుగుదేశం పార్టీలో చేరారు. మైలవరం తెలుగుదేశం పార్టీ మహా కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వారందరికీ పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు సమక్షంలో కొలకలూరి రవి ఆధ్వర్యంలో దాదాపు 50 …

Read More »

పసుపు మయంగా మారి మారిన గొల్లపూడి

గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు హరతులు పట్టి అశీర్వదించగా, యువత కధం తోక్కుతూ ముందుకు సాగుతుండగా తెలుగుదేశం కుటుంబ సభ్యులు వెంట రాగా గొల్లపూడి గ్రామంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు, యంపి అభ్యర్థి కేశినేని శివనాధ్ (చిన్ని) ప్రచారం లో దూసుకుపోతున్నారు. ప్రచార రధం పై నుంచి ప్రజలకు అభివాధం చేస్తూ సైకిల్ గుర్తు పై ఓట్లు వేయాలని అభ్యర్థిస్తూ  వసంత కేశినేని ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి …

Read More »

కొండపల్లి లో కొనసాగుతున్న వసంత శీరిష ఎన్నికల ప్రచారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రచారం లో భాగంగా ఆదివారం కోటయ్య నగర్, బొమ్మల కాలనీ ప్రాంతాల్లో స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగు మహిళలు, జనసేన, బిజెపి పార్టీ నాయకులు మహిళలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా పై ప్రాంతాల్లో ప్రజలను కలిసి మాట్లాడుతూ వారి కష్టసుఖాలు తెలుసుకుని తెలుగుదేశం పార్టీ అధికారం లోకి రాగానే సూపర్ సిక్స్ ఫధకాల ద్వారా ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. అందరిని అత్మీయంగా పలకరిస్తూ చిరు …

Read More »

పాత్రికేయ సోదరులతో వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆత్మీయ సమావేశం

-పాల్గొన్న మైలవరం తెదేపా అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాత్రికేయ సోదరులతో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలపై పాత్రికేయ సోదరులతో చర్చించారు. మీడియా సోదరులకు తను ఎప్పుడు అండగా ఉంటానని పేర్కొన్నారు. సమాజంలో ప్రజలను చైతన్యవంతులను చేయడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమన్నారు. …

Read More »