-టీడీపీలో చేర్చుకున్న మైలవరం తెదేపా కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్
గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఉదయం తెలుగుదేశం పార్టీలో చేరారు. మైలవరం తెలుగుదేశం పార్టీ మహా కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వారందరికీ పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు సమక్షంలో కొలకలూరి రవి ఆధ్వర్యంలో దాదాపు 50 కుటుంబాలకు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, పేదల సంక్షేమం నారా చంద్రబాబు నాయుడు పాలనలోనే సాధ్యమని పేర్కొన్నారు. మహాకూటమి మేనిఫెస్టోలో పేర్కొన్న సూపర్ సిక్స్ పథకాల వల్ల పేదలందరికీ మంచి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి, జనసేన, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News