గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో నూతనంగా ఏర్పాటు చేసిన లిటిల్ మిలీనియం చిల్డ్రన్ ప్లే స్కూల్‌ను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పాఠశాల యాజమాన్యం (సూర్య యాదవ్, హేమ దంపతులు) ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ని శాలువా పుష్ప గుచ్చాలతో ఘనంగా సన్మానించింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ లిటిల్ మిలీనియం వంటి సంస్థలు ఆధునిక బోధనా పద్ధతులతో పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నాయని ప్లేస్కూల్ యాజమాన్యం దినదిన ప్రవర్ధమానమై మరిన్ని బ్రాంచీలు నెలకొల్పి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం విద్యా రంగానికి పెద్దపీట వేస్తోందని, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామన్నారు.
అతిధి కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు మాట్లాడుతూ కుమారుడు సూర్య యాదవ్, కోడలు హేమ లిటిల్ మిలీనియం ప్లే స్కూల్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సమాజానికి తన వంతు బాధ్యతగా మంచి నడవడిక, ఆట పాటలతో కూడిన విద్యన, విలువలను మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో అందించాలనే ఉద్దేశంతో ఈ ఇనిస్ట్యూట్ నెలకొల్పారని మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.
ప్రిన్సిపల్ హేమ మాట్లాడుతూ లిటిల్ మిలీనియం సంస్థ దేశవ్యాప్తంగా వెయ్యి బ్రాంచీలు కలిగి ఉందని ఈ గొల్లపూడి బ్రాంచ్ మేము బాధ్యత తీసుకున్నామని విద్యారంగంలో 18 ఏళ్ల అనుభవం తమకు ఉందని, ప్లే, ఎక్స్పరిమెంటల్ తో కూడిన విద్యా విధానం ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో గొల్లపూడి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ నర్రా వాసు, టీడీపీ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, స్కూలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News