తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంత్రి కందుల దుర్గేష్ ని డా. పసుపులేటి హరిప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అకారి కృష్ణ అన్నగారైన కీర్తిశేషులు స్వర్గీయ అతికారి వెంకటయ్య ఇటీవల స్వర్గస్తులైన విషయం విదితమే. ఈ విషాద సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందులు దుర్గేష్ సిద్ధవటం నందు అకారి కృష్ణ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తిరుగు ప్రయాణ సమయంలో తిరుపతి ఎయిర్‌పోర్ట్ నందు మంత్రి కందులు దుర్గేష్ ని ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ కలిసి మర్యాదపూర్వకంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, నగర నాయకులు, వార్డు నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News