Breaking News

రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తూ రాజధాని అమరావతిలో APCRDA ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
“జాతీయ రహదారి భద్రతా మాసం–2026” సందర్భంగా “సడక్ సురక్ష – జీవన్ రక్ష”, అలాగే “Road Safety – Life Saving”(రహదారి భద్రత జీవిత పొదుపు) నినాదాలతో రాజధాని అమరావతిలో రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ APCRDA శనివారం బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమం నిర్వహణ ద్వారా APCRDA, రాజధాని అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులో భాగస్వామ్యమైన ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్స్(PgMC), ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ(PMC)ల ప్రతినిధులు, కాంట్రాక్టర్ సంస్థల సహకారంతో రోడ్డు ప్రమాదాలపై జీరో టోలరెన్స్ విధానాన్ని అమలు చేయడంపై APCRDA విస్తృత దృష్టి పెట్టింది. అమరావతిలో రహదారి భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

కార్యక్రమం నిర్వహణలో భాగంగా సిఆర్డిఏ OHS స్పెషలిస్ట్ యు. పాల్ సుధాకర్..కార్యక్రమానికి హాజరైన వారితో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, సురక్షిత డ్రైవింగ్‌ను ప్రోత్సహించడం, ప్రమాదాలను నివారించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం జాతీయ రహదారి భద్రతా మాసం ముగింపు సందర్భంగా రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించేందుకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తుళ్లూరు పోలీస్ స్టేషన్- ట్రాఫిక్ విభాగానికి చెందిన సీఐ బి. కోటేశ్వరరావు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సిఆర్డిఏ OHS స్పెషలిస్ట్‌లు జి. గోపీకృష్ణ, వి. హరికృష్ణ, వి. ప్రదీప్, ఎం. ఆరోన్ పాల్, PgMC ప్రతినిధులు గాజుల అరుణ్, కోమల్, PMC సంస్థల ప్రతినిధులు, వివిధ కాంట్రాక్టర్ సంస్థల సిబ్బంది పాల్గొన్నారు. అమరావతిలో క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బంది ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్నారు. రహదారి భద్రత APCRDAకు ముఖ్య ప్రాధాన్యత అని, రాబోయే రోజుల్లో కూడా సంబంధిత శాఖలు, ప్రతినిధుల సమన్వయంతో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, రహదారి ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాల రక్షణకు కట్టుబడి ఉంటామని కార్యక్రమ నిర్వాహకులు వెల్లడించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *