Breaking News

మహిళల ఆర్థిక స్వాలంబనకు కేశినేని ఫౌండేషన్ అండగా వుంటుంది.

-ఎన్.ఐ.ఆర్.డి లో శిక్ష‌ణ పొందుతున్న మ‌హిళ‌ల‌ను క‌లిసి స్పూర్తి నింపిన కేశినేని జాన‌కీ ల‌క్ష్మీ
-శిక్షణ తీసుకుంటున్న 50 మంది ఎస్.హెచ్.జి మహిళలకు కేశినేని జాన‌కీ ల‌క్ష్మీ సర్టిఫికేట్లు అందజేత
-ఎన్.ఐ.ఆర్.డి లో జ్యూట్ అండ్ కాట‌న్ బ్యాగ్స్ హెర్బ‌ల్ ప్రొడ‌క్ట్స్ పై 4వ రోజు శిక్ష‌ణ
-ఎస్.హెచ్.జి మహిళలు స్వయం సమృద్ది వైపు అడుగులు వేయాలి
-కేశినేని ఫౌండేషన్ మ‌రియు ఎన్.ఐ.ఆర్.డి ద్వారా పొందిన శిక్షణతో జీవనోపాధి మెరుగుపర్చుకోవాలి
-కేశినేని ఫౌండేషన్ చైర్మన్, ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మీ ఆకాంక్ష

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళల ఆర్థిక స్వతంత్రతే కుటుంబం, సమాజం ,రాష్ట్ర అభివృద్ధికి పునాది. ఎస్.హెచ్.జి మహిళలు స్వయం సమృద్ధి వైపు ధైర్యంగా అడుగులు వేయాలి. ఎంపీ కేశినేని శివనాథ్, కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్.ఐ.ఆర్.డి సహకారంతో అందిస్తున్న నైపుణ్యాభివృద్ది శిక్షణను వినియోగించుకుని జీవనోపాధిని మెరుగుపర్చుకోవాలని కేశినేని ఫౌండేషన్ చైర్మన్, ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మీ ఆకాంక్షించారు.

హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌న‌వ‌రి 28వ తేదీ నుంచి ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు ఐదు రోజుల పాటు సాగుతున్న జ్యూట్ అండ్ కాట‌న్ బ్యాగ్స్ హెర్బ‌ల్ ప్రొడ‌క్ట్స్ నైపుణ్యాభివృద్ది శిక్షణా కార్యక్రమంలో శిక్షణ తీసుకుంటున్న ఎన్టీఆర్ జిల్లా ఎస్.హెచ్.జి కి చెందిన 50 మంది మహిళలను కేశినేని జానకి లక్ష్మీ శ‌నివారం కలిశారు. ఈ మేరకు ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి లో గత మూడు రోజులుగా ఎస్.హెచ్.జి మహిళులు పొందుతున్న శిక్షణ వివరాలను జానకీ లక్ష్మీ వారిని అడిగి తెలుసుకున్నారు. అలాగే జ్యూట్ అండ్ కాట‌న్ బ్యాగ్స్ హెర్బ‌ల్ ప్రొడ‌క్ట్స్ తయారీ పై తాము పొందుతున్న శిక్షణ లో భాగంగా తయారు చేసిన సోప్స్ , షాంప్స్, జ్యూట్ అండ్ క్లాత్ బ్యాగ్స్ చూపించారు.

అలాగే ఎస్.హెచ్.జి మహిళలు కేశినేని జానకి లక్ష్మీతో మాట్లాడుతూ ఎంపీ కేశినేని శివనాథ్ చొరవ, కేశినేని ఫౌండేషన్ సహకారంతోనే ఈ నైపుణ్యాభివృద్ది శిక్షణ అవకాశం వచ్చిందన్నారు. తమ జీవనోపాధి మెరుగుపర్చుకునేందుకు శిక్షణ ఇప్పించినందుకు ఎంపీ కేశినేని శివనాథ్ కు వారంతా ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం జానకి లక్ష్మీ మాట్లాడుతూ మహిళలు తల్చుకుంటే ఏమైనా సాధించగలరని, ముఖ్యంగా పొదుపు చేయటం తెలిసిన ఎస్.హెచ్.జి మహిళలు మరింత శక్తివంతులన్నారు. పొదుపు చేయటంలో విజయం సాధించిన మహిళలు, స్వయం ఉపాధి రంగంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఎస్.హెచ్.జి అంటే కేవలం సేవింగ్స్ మాత్రమే కాదు…స్వయం సమృద్ది వైపు అడుగులు వేయటమన్నారు. కేశినేని ఫౌండేషన్ ఎప్పటికప్పుడు మహిళల నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తూ నిలబెట్టే సంస్థగా కొనసాగటంతోపాటు, ఎల్లప్పుడూ అండగా, తోడుగా ఉంటుందన్నారు.

ఎన్.ఐ.ఆర్.డి శిక్షణ పొందిన మహిళలకు మండలాలకు వచ్చి కలుస్తానని…ఇక్కడ శిక్షణ ద్వారా నేర్చుకున్న అంశాలను గ్రామాల్లోని ఇతర మహిళలకు నేర్పించి అందరూ కలిసి ఒక ప్రొడక్ట్ యూనిట్ నెలకొల్పాలన్నారు. యూనిట్ లో తయారు చేసే వస్తువులకు మార్కెటింగ్ సహకారం అందిస్తామని భరోసా కల్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమైన కుటుంబానికి ఒక పారిశ్రామిక వుండాలన్న నినాదం స్పూర్తితో ఎంపీ కేశినేని శివనాథ్, కేశినేని ఫౌండేషన్ ద్వారా కృషి చేస్తున్నారని తెలిపారు. అందుకే తన సొంత నిధులతో ఎంపీ కేశినేని శివనాథ్ గ్రామాల పరిపూర్ణ వికాసం కోసం, మహిళల సాధికారత, స్వాలంబన సాధించే విధంగా ప్రణాళిక సిద్దం చేసి ..ఆ దిశగా ఎన్.ఐ.ఆర్.డి, ఎన్టీఆర్ జిల్లా అధికారుల సహకారంతో ఒక ప్ర‌ణాళిక‌గా ముందుకు వెళుతున్నారని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎన్.ఐ.ఆర్.డి సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ మ‌హ్మాద్ ఖాన్, ప్రొఫ‌స‌ర్ డాక్ట‌ర్ క‌తిరేష‌న్, ట్రైన‌ర్స్ ఝాన్సీ లక్ష్మీ బాయి , డా. జి. అంబిక ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *