Breaking News

రహదారి భద్రతపై విద్యార్థులలో అవగాహన అభినందనీయం..

-విద్యార్థులు ట్రాఫిక్ రూల్స్ను తప్పక పాటించాలి..
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రహదారి భద్రత పై విద్యార్థులలో అవగాహన కల్పించుకోవడంతో పాటు ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించేలా ప్రజలలో చైతన్యం తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ విద్యార్థులకు సూచించారు. జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల భాగంగా విద్యార్థులకు నిర్వహించిన క్విజ్, వ్యాస రచన, పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు శనివారం కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ ప్రశంస పత్రాలను అందజేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు నివారించడంలో రవాణా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలకు తోడు ప్రజాల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. రోడు భద్రత పై ప్రజలలో అవగాహన కల్పించి చైతన్యవంతులను చేయడంలో విద్యార్థులు కీలక పాత్ర పోహించాలన్నారు. సురక్షితమైన ప్రయానం మితిమిరిన వేగం నియంత్రణ ట్రాఫిక్ రూల్స్ పాటించడం వంటి జాగ్రత్త చర్యలను ప్రజలకు వివరించడంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని కోరారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చునన్నారు. కారులో ప్రయాణించేటప్పుడు వాహన చోదకుడుతో పాటు మిగిలిన వారు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తెలిపారు. మితిమిరిన వేగంతో వాహనాలు నడపాడం ప్రమాదాలకు దారి తీస్తాయన్నారు. వాహనం నడుపుతున్నప్పుడు ఫోన్లో మాట్లాడటం, మెసేజ్లు చేయడం వంటివి చేయకూడదని, ఇటువంటివి ఏకాగ్రతను దెబ్బతీస్తుందని చట్టరీత్యా నేరమన్నారు. యువతలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువకులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. రోడ్డు భద్రత అనేది ఒక నిరంతర ప్రక్రియ అని, ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్టీవోలు అర్ ప్రవీణ్, కె వెంకటేశ్వరరావు, మోటార్ వెహికల్ తనిఖీ అధికారులు, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *