-ప్రారంభమైన హెలిరైడ్…
-ఈనెల 9 నుంచి 17వ తేది వరకు ప్రతీ రోజు ఉ.10 నుంచి సా.5 వరకు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులకు హెలికాఫ్టర్ లో విహరిస్తూ బెజవాడ అందాలను ఆస్వాదించే అవకాశాన్ని జిల్లా యంత్రాoగం, పర్యాటకశాఖ, నగర మున్సిపల్ కార్పొరేషన్. శ్రీ దుర్గామలేశ్వర స్వామి వార్ల దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాయి.శనివారం స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత భార్గవ, విజయవాడ సెంట్రల్ ఏంఎల్ ఏ మల్లాది విష్ణు ఈ విహంగ సేవలు ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ జె. నివాస్,నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఏవియషన్ కార్పొరేషన్ యండి భరత్ రెడ్డి, వియంసి కమిషనర్ వి.ప్రసన్న వెంకటేష్, సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్,ఆలయ ఈవో డి.భ్రమరాంబ, తదితరులు పాల్గొన్నారు. తొలుత ఆలయ ఈఓ బ్రమరాంభ ప్రయాణికులతో కలిసి విహంగ వీక్షనం చేశారు.కలెక్టర్ జె.నివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) శివశంకర్ కూడా నగర అందాలను చూసారు. ఈ రోజు నుంచి 17 దాకా జరిగే హెలి రైడ్ ప్రతీ రోజు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఆరు నిమిషాల విహంగ యాత్రాకు రూ. 3500/- , 13 నిమిషాలకు రూ. 6000/- ధరను నిర్ణయించారు.సన్ రైజ్ ఎయిర్ ఛార్టర్ సంస్థ, తుంబై ఎవియేషన్ ప్రైవేట్ సంస్థ సంయుక్తంగా హెలికాప్టర్ నిర్వహణ భాధ్యతలను చూస్తారు. దుర్గమ్మ భక్తులు,నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. నివాస్ కోరారు. విమానం ప్రయాణిం వచ్చు కానీ హెలి కాప్టర్ ప్రయాణం వింత అనుభూతి నిస్తుందన్నారు.