Breaking News

ప్రభుత్వమా? రియల్ ఎస్టేట్ బ్రోకరా? అమరావతి భూసేకరణపై వెల్లువెత్తుతున్న నిరసనలు… : వడ్డే శోభనాధిశ్వర రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న భూసేకరణ విధానాలు, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రణాళికలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ప్రజా సమస్యలను పరిష్కరించి మెరుగైన పరిపాలన అందించాల్సిన ప్రభుత్వం నేడు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వడ్డే శోభనాద్రిశ్వరరావు తెలిపారు. ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ రాజధాని రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి, ప్రైవేట్ సంస్థల లాభం కోసమే ప్రభుత్వం పాకులాడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి నెరవేరని హామీలు మళ్ళీ సేకరణే లక్ష్యం!
గత 12 ఏళ్లుగా రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటివి కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మూలాలు పేర్కొంటున్నాయి నేటికీ దాదాపు 2,000 మంది రైతులకు అందాల్సిన 7,000 ప్లాట్లు పెండింగ్‌లోనే ఉన్నాయి ఈ పాత సమస్యలను పరిష్కరించకుండానే, తాజాగా ఏడు గ్రామాల నుండి మరో 20,000 ఎకరాల అదనపు భూమిని సేకరించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుండటం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది మొత్తం 43 గ్రామాల్లోని 1.54 లక్షల ఎకరాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించి, అక్కడ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు నిర్మించేలా మాస్టర్ ప్లాన్ రూపొందించడం వెనుక స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి
ఔటర్ రింగ్ రోడ్ (ORR): అవసరమా? వ్యాపారమా
అమరావతి కోసం ప్రతిపాదించిన 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి [ సుమారు 60-70 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ నగరానికే 158 కిలోమీటర్ల ORR ఉండగా, కేవలం 2 లక్షల జనాభా ఉన్న అమరావతికి ఇంత పెద్ద రోడ్డు అవసరమా అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు సాధారణంగా జాతీయ రహదారులకు 70 మీటర్ల వెడల్పు సరిపోతుండగా, భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, హోటళ్లు, లాడ్జీల నిర్మాణం కోసం ప్రభుత్వం ఏకంగా 140 నుండి 150 మీటర్ల వెడల్పున భూసేకరణ చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి ఇది కేవలం భూములు గుంజుకునే “తుగ్లక్ ఆలోచన” అని విమర్శించబడింది సాగునీటి రంగం నిర్లక్ష్యం – సోలార్ ప్రాజెక్టుల పేరిట భూదందా
రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో ఉన్నా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగు గంగ వంటి ప్రాజెక్టుల ప్రధాన కాలువలు పూర్తయినా, పొలాలకు నీరందించే పంట కాలువలు పూర్తి కాలేదు అలాగే, రాష్ట్రంలోని 110 ఎత్తిపోతల పథకాల్లో (Lift Irrigation) సగం పడకేశాయి మరోవైపు,120 గిగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి పేరుతో ప్రభుత్వం లక్షల ఎకరాల పేదల భూములను సేకరించాలని చూస్తోంది చైనా వంటి దేశాల్లో ఇళ్లపై, పాఠశాలలపై రూఫ్ టాప్ సోలార్ పద్ధతిని ప్రోత్సహిస్తూ రైతుల భూములను కాపాడుతున్నారని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే పద్ధతిని అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు బలవంతపు భూసేకరణ వల్ల పేదల జీవించే హక్కుకు (ఆర్టికల్ 21) భంగం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు.చట్టపరమైన హెచ్చరికలు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈ.ఏ.ఎస్. శర్మ వంటి మేధావుల సలహాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని, ఇది భవిష్యత్తులో 2G స్పెక్ట్రమ్ లేదా బొగ్గు కుంభకోణం వంటి న్యాయపరమైన చిక్కులకు దారి తీయవచ్చని హెచ్చరికలు అందుతున్నాయి కరేడులోని మామిడి తోటలు, మందసాలోని జీడిమామిడి తోటలను సేకరించడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని విమర్శకులు గుర్తు చేస్తున్నారు ప్రభుత్వం తన పద్ధతిని మార్చుకోకపోతే ప్రజల నుండి తీవ్ర ప్రతిఘటన తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *