-ప్రజా సమస్యల పరిష్కారానికి 1100 కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోండి
-కలెక్టర్ కీర్తి చేకూరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఫిబ్రవరి 9వ తేదీ (సోమవారం) రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించనున్న 3వ మంత్రులు–కార్యదర్శుల సదస్సు (Ministers’ and Secretaries’ Conference)కు జిల్లా కలెక్టర్లు, ఎస్పీ లు మరియు ఇతర జిల్లా అధికారులు వారి బృందం వర్చువల్ విధానంలో హాజరు కావాల్సి ఉన్నందున, ఫిబ్రవరి 9 న జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ / రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఫిర్యాదులు అందజేయడానికి ఫిబ్రవరి 9న జిల్లా కలెక్టరేట్, డివిజన్, మండల కార్యాలయాలకు రావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. తదుపరి సోమవారం నుంచి పీజీఆర్ఎస్ కార్యక్రమం యథావిధిగా నిర్వహించ బడుతుందని తెలిపారు. అలాగే ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1100 కాల్ సెంటర్ సేవలను ప్రజలు విస్తృతంగా వినియోగించు కోవాలని కలెక్టర్ సూచించారు. అత్యవసర సమస్యలు, ఫిర్యాదులను 1100 కాల్ సెంటర్ ద్వారా నమోదు చేయవచ్చని, పరిష్కార స్థాయి తెలుసుకునే అవకాశం ఉందని తెలిపారు.
Prajavartha Online Telugu News