Breaking News

ప్రజాసమస్యల పరిష్కారం.. నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యం… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కారం, నియోజక వర్గ అభివృద్ధే తన లక్ష్యమని రాష్ట్ర రవాణా,సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. మంగళవారం ఆయన మచిలీపట్నం మండలం తాళ్లపాలెం పంచాయతీ పరిధిలోని పల్లె తాళ్లపాలెం గ్రామంలో పర్యటించారు. తొలుత ఆయన రోడ్లను పరిశీలించి సీసీ, బీటీ రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. అలాగే కల్వర్టు వద్ద పడిన గుంతలను పూడ్చడమే కాక పంట కాలువ నుంచి దిగువకు నీరు సక్రమంగా ప్రవహించేందుకు అక్కడ మూడు పెద్ద తూములను ఏర్పాటు చేసే విషయాన్నీ గురించి అధికారులకు తెలియచేసి సంబందించిన పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. అలాగే వీధి లైట్ల విషయాన్నీ గురించి మంత్రి ప్రస్థావిస్తూ వెంటనే 17 విద్యుత్ స్తంబాల ఏర్పాటుతో పాటు వీధి లైట్లు కూడా వెంటనే ఏర్పాటు చేయాలనీ సంబంధిత విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. తమ గ్రామంలో తుఫాను రక్షిత భవనం శిధిలమైందని స్థానికులు చెప్పారు. మంత్రిని స్వయంగా ఆ ప్రాంతానికి తీసుకువెళ్లి బీటలు వారిన గోడలు పెచ్చులూడిన స్లాబ్ తీరును చూపించారు. ఈ విషయమై స్పందించిన ఆయన జవాబిస్తూ, సైక్లోన్ షెల్టర్ నిర్మాణం స్థానంలో త్వరలోనే మరో నూతన భవనం ఏర్పాటు విషయంపై తప్పక చొరవ చూపుతానని చెప్పారు. దంతాలు ఊడిపోయిన ఒక మహిళ వైద్య సమస్యను గుర్తించిన మంత్రి ఆమెతో మాట్లాడుతూ, ఆహారాన్ని సరిగా నమిలి తినలే నప్పుడు పలు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని కనుక దంత చికిత్స నిమిత్తం మచిలీపట్నం రావాలని, తాను కృత్రిమ శాశ్వత దంతాల అమరిక గూర్చి దంతవైద్యునితో మాట్లాడి ఉడిపోయిన పళ్ళు స్థానంలో శాశ్వత కృత్రిమ దంతాలు అమర్చేలా వైద్యునితో మాట్లాడతానని మంత్రి పేర్ని నాని చెప్పారు. అలాగే, మరో దివ్యాంగుడైన యువకుని వికలత్వ సర్టిఫికెట్ సమస్య గూర్చి మాట్లాడుతూ, సదరంలో వికలత్వ శాతం పత్రం మంజూరు కోసం మచిలీపట్నం రావాలని, ఆ ఇరువురిని వెంటబెట్టుకుని రెండు రోజుల్లో రావాలని గ్రామ వాలంటీర్ కు మంత్రి తెలిపారు.
ఇటీవల తమ మాతృమూర్తిని కోల్పోయిన విశ్రా0త ఆర్టీసీ ఉద్యోగి దేవనబోయిన రాజారావు ఇంటికి మంత్రి పేర్ని నాని వెళ్లి నల్గురు సోదరులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు
ఈ పర్యటన కార్యక్రమంలో మచిలీపట్నం ఇంచార్జ్ ఎం పి డి ఓ, డ్వామా పీడీ జి. సూర్యనారాయణ , పంచాయితీరాజ్ డీ ఇ, లక్ష్మీ నారాయణ, ఏ ఈ వై. ధర్మయ్య , తాళ్లపాలెం సర్పంచ్ మదిరి అశ్విని, మాజీ సర్పంచ్ వాలిశెట్టి రవిశంకర్, కానూరు పి ఏ సి ఎస్ ఛైర్పర్సన్ శ్రీకాకుళ పు నాగేశ్వరరావు (బాబు), స్థానిక నాయకులు కృష్ణారావు, పుల్లయ్య, పంచాయతీ కార్యదర్శి రవిశంకర్, దినేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *