తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. బ్రహ్మోత్సవాల అరవ రోజు మలయప్పస్వామి స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. హనుమంత వాహనం అంటే మనమందరం అయన సేవకులమే అని అర్థం. వీరిలో దిక్పాలకులూ ఉన్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని కీర్తిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు. తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, పాలకమండలి సభ్యులు వాహన సేవలో పాల్గొన్నారు. కొవిడ్ నేపథ్యంలో ఆలయంలోని కల్యాణ మండంలో వాహనసేవ ఏకాంతంగా నిర్వహించారు.
Tags tirumala
Check Also
పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…
-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను …