విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైసిపి నాయకులు పోతిన వెంకట మహేష్ ఆదివారం కొత్తపేట, కోమల విలాస్ సెంటర్ వద్ద గల వారి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… రాష్ట్రం గంజాయి, డ్రగ్స్ కి కేరాఫ్ గా మారిపోతుందన్నారు. తొందరలోనే డ్రగ్స్, గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. రెండేళ్ళలో 2 న్నర లక్షల గంజాయి కేసులు 2500 కి పైగా డ్రగ్స్ కేసులు ఈగల్ టీం కేసులు పెట్టారన్నారు. రాష్ట్రంలో కి గంజాయి, డ్రగ్స్ ఎవరి ప్రోద్భలంతో వస్తున్నాయన్నారు. విచ్చలవిడిగా విక్రయాలు ఎలా జరుగుతున్నాయన్నారు. 6 నెలల వ్యవధిలో 44 వేలకు పైగా ఈగల్ టీం కేసులు నమోదు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయి డ్రగ్స్ విక్రయాలు విచ్ఛలవిడిగా మారిపోయాయన్నారు. డ్రగ్స్, గంజాయి ప్లెడ్లర్స్ ను పట్టుకోవడంలో ప్రభుత్వం, పోలీస్ ఫెయిల్యూర్ అని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు లో గంజాయి సాగు చేయడం, ఏజెన్సీలోనే కాకుండా రాజధాని ప్రాంతంలో గంజాయి సాగుచేస్తుంటే పోలీసులు పట్టుకున్నారన్నారు. బెజవాడ లో ఒక హాస్టల్ వెనుక గంజాయి చెట్లు పెంచుతున్నారంటే పరిస్ధితి ఎంత దారుణంగా మారిందో అర్ధం చేసుకోండన్నారు. గంజాయి సిగరెట్లు విచ్ఛలవిడిగా అమ్ముతున్నారన్నారు. రాజధాని నగరం గంజాయి మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారిపోయిందా న్నారు. డాబాలపైన గంజాయి పండించుకోవచ్చని చెబుతున్నారన్నారు. సాంప్రదాయ పంట వరి లాగా ఇక నుంచి గంజాయి కూడా పండిచ్చుకోవచ్చా అని అన్నారు. సిపి రాజశేఖర్ బాబు సమాధానం చెప్పాలన్నారు. సైకిల్ ర్యాలీ చేసి దండయాత్ర అంటే బాధ్యత తీరిపోయిందా అని అన్నారు. డ్రగ్స్ ను నియంత్రించకుండా ప్రచార ఆర్భాటమేంటి అని అన్నారు. టూ వీలర్, ఆటోలకు చలానాల మీదున్న శ్రద్ధ డ్రగ్స్, గంజాయి అమ్మకాలపై శ్రద్ధ ఏది అని అన్నారు. గంజాయి, డ్రగ్స్ సప్లై చేసే వారిపై చర్యలేవి అని అన్నారు. చిన్న చిన్న పిల్లలు గంజాయి సిగరెట్లు తాగుతున్న వీడియోలు ఉన్నాయన్నారు. విద్యార్ధులు,పిల్లల జీవితాలు కాపాడే బాధ్యత ఎందుకు తీసుకోవడం లేదన్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజల జీవితాలు నాశనమవుతుంటే పట్టించుకోరా అని అన్నారు. హోంమంత్రి అనిత రాష్ట్రంలో గంజాయి కేసులే లేవని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో కి మత్తుపదార్థాలు వస్తుంటే మీ బాధ్యత ఏంటి అని అన్నారు. ఆటలాడుకోవడానికి, వినోదాల కోసం సమయం వెచ్చిస్తున్నారన్నారు. ఏజెన్సీ నుంచి గంజాయి వస్తుంటే ఎవరి నియోజకవర్గం దాటి వస్తుందో హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలన్నారు. వైసిపి నేతలపై అక్రమ కేసులు లోకేష్ పెట్టిస్తున్నారు. గంజాయి, డ్రగ్స్ సరఫరా చేసే ప్లెడ్లర్స్ కు రెడ్ బుక్ వర్తించదా అని అన్నారు. రాష్ట్రంలో యువత జీవితం నిర్వీర్యమైపోతుంది పవన్ ..మీకు బాధ్యత లేదా అని అన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలను విక్రయిస్తే ఊరుకోనని చంద్రబాబు చెబుతున్నారు. మాటల్లో కాదు బాబు గంజాయి, డ్రగ్స్ ను క్షేత్రస్ధాయిలో పట్టుకోండన్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లోనే కార్యాచరణ రూపొందిస్తాం…వైసిపి తరపున గంజాయి, డ్రగ్స్ నిర్మూళన ధ్యేయంగా పనిచేస్తాంమన్నారు.
Prajavartha Online Telugu News