రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం (2.3.2026) జిల్లా కలెక్టర్ కార్యాలయం లో “మీకోసం” కార్యక్రమం (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) మరియు రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహించబడనున్నట్లు జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి తదితర వివరాల కోసం 1100 (డబుల్ వన్ డబుల్ జీరో) కు నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు. వాట్సప్ నెంబర్ 95523 00009 ద్వారా పౌర సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్ మరియు మండల స్థాయిలలో కూడా “మీకోసం”, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఆర్డీవో లు, తహశీల్దార్లు తమ ప్రధాన కార్యాలయాల నుంచి హాజరై ప్రజల అర్జీలను స్వీకరించి పరిష్కార చర్యలు చేపడతారని వెల్లడించారు. గ్రామ స్థాయిలో కూడా అర్జీలను స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందవచ్చని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News