-గత రెండు రోజుల్లో 25 వాహనాలు సీజ్ కేసులు నమోదు
-జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి డి. ఫణిభూషణ్ రెడ్డి
రాజహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాలో అక్రమంగా ఇసుక, కంకర మరియు ఇతర చిన్న తరహా ఖనిజాల రవాణాపై గనుల శాఖ ప్రత్యేక దృష్టి సారించిందనీ , అందులో భాగంగా ఫిబ్రవరి 28, మార్చి ఒకటవ తేదీలలో కడియం మండలం పరిధిలో, బొమ్మూరు నుండి వేమగిరి వెళ్లే హైవే మార్గమధ్యంలో పలు ప్రాంతాల్లో రూట్ చెక్ నిర్వహించినట్లు జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి డి. ఫణిభూషణ్ రెడ్డి తెలిపారు. తనిఖీలలో భాగంగా పంగిడి ప్రాంతం నుండి వస్తున్న 12 రోడ్ మెటల్ లారీలు, రంగంపేట నుండి వస్తున్న 8 గ్రావెల్ లారీలు, రాఘవాపురం నుండి వస్తున్న ఐదు ఆర్డినరీ ఎర్త్ రవాణా చేస్తున్న లారీలు గుర్తించబడినట్లు ఆయన తెలిపారు. వాహనాల డ్రైవర్లను మైనింగ్ బిల్లులు చూపించాలని కోరగా, సరైన పత్రాలు చూపలేలేదన్నారు.
దీనితో మొత్తం 25 వాహనాలను స్వాధీనం చేసుకుని భద్రతా నిమిత్తం కడియం పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు తెలిపారు. మైనింగ్ బిల్లు లేకుండా చిన్న తరహా ఖనిజాలను రవాణా చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించడం మాత్రమే కాకుండా ఏపీ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్, 1996 (APMMC Rules, 1996) ఉల్లంఘనకూ పాల్పడినట్లవుతుందని తెలిపారు. సంబంధిత వాహన యజమానులు, బాధ్యులపై శాఖాపరమైన చర్యలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ఖనిజాలను త్రవ్వడం, తరలించడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవని జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి హెచ్చరించారు.
ఈ తనిఖీలో జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి డి. ఫణిభూషణ్ రెడ్డి, కార్యాలయ సాంకేతిక సిబ్బంది జి. విఘ్నేశ్వరుడు (అసిస్టెంట్ జియోలాజిస్ట్), డి. జ్యోతిర్మయి (అసిస్టెంట్ జియోలాజిస్ట్), రెవెన్యూ ఇన్స్పెక్టర్ మనీషా, టెక్నికల్ అసిస్టెంట్ ఎ. శైలజ, జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎస్. సాయి కృష, హోం గార్డులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News