Breaking News

నిబద్ధతతో జనగణన విధులు నిర్వర్తించాలి…

-కచ్చితమైన డేటా సేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి
-పూర్తిస్థాయి అవగాహనకు శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి
-క్షేత్రస్థాయిలోనూ శిక్షణ కార్యక్రమాలను పగడ్బందీగా నిర్వహించాలి
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనగణన విధులను అత్యంత నిబద్ధతతో, జవాబుదారీతనంతో నిర్వర్తించాలని డా. జి.లక్ష్మీశ స్పష్టం చేశారు. కచ్చితమైన డేటా సేకరణ దేశ అభివృద్ధి ప్రణాళికలకు పునాదిగా నిలుస్తుందని, అందువల్ల ప్రతి అధికారి, సిబ్బంది తమ బాధ్యతలను పూర్తిస్థాయిలో అర్థం చేసుకుని పనిచేయాలని సూచించారు.

ఆదివారం విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో సెన్సస్–2027కు సంబంధించిన తొలి దశ (హౌస్ లిస్టింగ్ & హౌసింగ్ సెన్సస్)పై జిల్లా సెన్సస్ అధికారులు, ఛార్జ్ స్థాయి అధికారులకు నిర్వహించిన మూడో రోజు, చివరి శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ (హైదరాబాద్) కార్యాలయ జాయింట్ డైరెక్టర్ జి. ప్రసన్న కుమార్ కూడా కార్యక్రమానికి హాజరై పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ద్వారా అధికారులకు సమగ్ర అవగాహన కల్పించబడిందన్నారు. ఇందులో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడమే అసలు విజయమని, అందుకుగాను క్షేత్రస్థాయిలో సిబ్బందికి పగడ్బందీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
ఈసారి జనగణన ప్రక్రియ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించబడనుందని తెలిపారు. మొబైల్ యాప్‌లు, ఆన్‌లైన్ మాడ్యూల్‌లు, డేటా అప్లోడింగ్ వ్యవస్థలపై సిబ్బంది పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక లోపాలు, డేటా ఎంట్రీ పొరపాట్లు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
జనాభా లెక్కల సేకరణ రెండు దశల్లో జరుగుతుందని వివరించారు. తొలి దశగా హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ , రెండో దశ పాపులేషన్ ఎన్యూమరేషన్ (పీఈ)లో జనాభా గణాంకాలు నమోదు చేయబడతాయని చెప్పారు. ఈ రెండు దశలు సమగ్రంగా, ఖచ్చితంగా అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు.

జనగణన ద్వారా లభించే సమాచారం ప్రభుత్వ విధానాల రూపకల్పనకు, సంక్షేమ పథకాల అమలుకు, వనరుల సమర్థ వినియోగానికి కీలకమని పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి, మౌలిక సదుపాయాల వంటి రంగాలలో సరైన ప్రణాళిక రూపొందించాలంటే ఖచ్చితమైన గణాంకాలు అవసరమన్నారు. అందువల్ల అత్యంత పారదర్శకతతో, నిబద్ధతతో, ఎలాంటి వివక్ష లేకుండా సమాచారం సేకరించాలని సూచించారు.
కార్యక్రమంలో డీఆర్‌వో ఎం. లక్ష్మీనరసింహం, సీపీవో వై. శ్రీలత, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏఎస్‌వోలు, డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *