అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వైసీపీ అధిష్టానం, నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానంపై కక్షగట్టారని కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం అన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నట్లు డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి ఆయన వ్యక్తిత్వం పై బురద జల్లాలని చూస్తున్నారన్నారు. తిరుమలలో జగన్ హయాంలో జరిగిన అక్రమాలను, తప్పులను వెలికితీస్తున్నందుకే వైసీపీ అధిష్టానం బిఆర్ నాయుడు పై తప్పుడు ప్రచారానికి దిగిందన్నారు. జగన్ రెడ్డి హయాంలో తిరుమల లడ్డు కల్తీ అంశంలో ప్రజలు వైసీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉండడంతో దాని నుంచి బయటపడడానికి ఇటువంటి పనికిమాలిన చర్యలకు ఆ పార్టీ సోషల్ మీడియా పూనుకుందన్నారు. వైసీపీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఎంత తలబాదుకున్నా నాడు జరిగిన పాపాలన్నీ కూటమి ప్రభుత్వం తప్పక వెలికి తీసి నిందితులను శిక్షించడం ఖాయం అని అన్నారు.
Prajavartha Online Telugu News