Breaking News

గెలిచిన అభ్యర్ధులకు డిక్లరేషన్ పత్రాలను అందజేత…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణం మరియు స్విమ్మింగ్ పూల్ సొసైటీ పాలకవర్గ సెక్రెటరీగా వజ్జా రామకృష్ణ ఎన్నికైనట్లు డిప్యూటీ కమిషనర్, ఎన్టీఆర్ స్టేడియం ఎక్స్ అఫిషియో జాయింట్ సెక్రటరీ, ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గ ఎన్నికల అధికారి సిహెచ్.శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం జరిగిన ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించి, గెలిచిన అభ్యర్ధులకు డిక్లరేషన్ పత్రాలను అందజేశామని ఎన్నికల అధికారి తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గం ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. స్టేడియంలో మొత్తం 2,160 మంది ఓటు హక్కు కలిగి ఉండగా, వారిలో 1267 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. 20 ఓట్లు చెల్లలేదని తెలిపారు. సెక్రటరీ పోస్టునకు పోటీ పడిన అభ్యర్ధుల్లో వజ్జా రామకృష్ణకు 851 ఓట్లు పోల్ కాగా, దొడ్డపనేని రాజేంద్ర కుమార్ కు 396 ఓట్లు పోలయ్యాయని, వజ్జా రామకృష్ణకు 455 ఓట్లు మెజారిటీ వచ్చినందున ఆయనను సెక్రటరీ గా గెలుపొందినట్లు డిక్లేర్ చేయుట జరిగిందన్నారు. వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కు దామా మహేశ్వరరావు, జాయింట్ సెక్రెటరీకి పోస్టుకు పాకనాటి ఉమామహేశ్వరరావు, ట్రెజరర్ పోస్టుకు కండె కాంతారావులకు మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కి పురుషులలో ఇంకొల్లు వెంకట రత్తయ్య, జి. హనుమంతరావు, మహిలలో గుంటుపల్లి యామిని శివ జ్యోతి, లగడపాటి అంజలి లు గెలుపొందగా వారికి డిక్లరేషన్ పత్రాలను అందజేశామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *