Breaking News

అగ్రిగోల్డ్ బాధితుల ఆర్తనాదాలపై సీఎం స్పందించాలి

-ప్రభుత్వం/కోర్టు ముందుకి యాజమాన్యం రావాలి
-ఎమ్మెల్యేలు అందరూ గళమెత్తి బాధితులకు తోడ్పడాలి
-ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఈశ్వరయ్య, చలసాని
-ధర్నా చౌక్‌లో అగ్రిగోల్డ్ బాధితుల దీక్షలు ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ధర్నా చౌక్‌లో అగ్రిగోల్డ్ బాధితుల మరోపోరాటాన్ని ప్రారంభించారు. సోమవారం జరిగిన రిలే నిరహార దీక్ష శిబిరంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల బాధితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు అధ్యక్షత వహించారు. దీక్షా పరులకు పూలమాలలేసి శిబిరాన్ని ప్రారంభిస్తూ..అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ, పుష్కర కాలం నిండనున్న అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలు తీరకపోవడం బాధాకరమని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల ఆర్తనాదాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాలని ముప్పాళ్ల విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అంగీకరించిన ప్రత్యేక కోర్టును శాసనసభ సమావేశాలు ముగిసేలోగా తగిన ఆదేశాల ద్వారానే సమర్థ అధికారుల సీఐడీ బృందాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని, యాజమాన్యపు కుట్రలు, కుతంత్రాలను ప్రభుత్వం తిప్పికొట్టి సకల ఆస్తులను బహిరంగ వేలం నిర్వహించాలని, కంపెనీ చైర్మన్ అవ్వా సీతారామరావు, వారి సోదరుల కుటుంబ సభ్యుల పేర్ల మీదున్న ఆస్తులను కూడా తక్షణమే జప్తు చేయాలని ముప్పాళ్ల డిమాండ్ చేశారు. కంపెనీ యాజమాన్యం ఏ మాత్రం నైతిక బాధ్యత ఉన్నా తమను నమ్మి నిలువునా మోసపోయిన బాధితులకు న్యాయం చేయడానికి ప్రభుత్వానికి సహకరించాలన్నారు.
ముఖ్యఅతిథిగా విచ్ఛేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ దశాu్ధ కాలానికిపైగా పట్టువీడని అగ్రిగోల్డ్ బాధితుల పోరాటం చరిత్రాత్మకమని, ఎన్నో విజయాలు సాధించి తుది విజయం కోసం వారు సాగిస్తున్న ఈ పోరాటానికి సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలియజేశారు. గత టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలతోపాటు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా బాధితులకు సంపూర్ణ న్యాయం చేయించాలని, అంకిత భావం పాలకులకు లేకపోవడం విచారకరమని అన్నారు. పదేళ్లుగా ముప్పాళ్ల నాగేశ్వరరావుతోపాటు ఈ విజయంలో భాగస్వాములుగా ఉంటూ, మరణించిన బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో ఒక ప్రైవేట్ కంపెనీ బాధితులకు ఇప్పించడం చిన్న విషయం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు, శాసన సభ్యులు గత ఎన్నికల్లో ఓట్లను అభ్యర్థించే సమయంలో ఇంటింటా ప్రచారం చేస్తూ, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఆ విషయాన్ని 20 నెలలుగా సీఎం దగ్గర ప్రస్తావించి న్యాయం చేయించడంలో మౌనం వహించడం బాధ్యతా రాహిత్యమని అన్నారు.
ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులకు యుద్ధప్రాతిపదికన న్యాయం చేయాలిసిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉందన్నారు. ఈ కంపెనీ వ్యవహారం, బాధితుల ఆందోళన, యాజమాన్యపు మోసం ప్రతి విషయమూ సీఎం చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం తొలి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సమయంలో..ప్రతి మంత్రివర్గ సమావేశంలో అగ్రిగోల్డ్ అంశాన్ని అజెండాగా చంద్రబాబు పెట్టి..చర్చించిన విషయం మర్చిపోయారా? అని గుర్తుచేశారు. ఆనాడు హైకోర్టు కూడా వారం..వారం అగ్రిగోల్డ్ అంశం విచారణ చేసిందని, అయినప్పటికీ అగ్రిగోల్డ్ యాజమాన్యం నేరపూరితమైన లీగల్ లిటిగేషన్లు పెట్టి, ఆస్తుల విక్రయాలకు అడ్డుపడటం దుర్మార్గమని చెప్పారు. 5వ తేదీ నుంచి వీరు తలపెట్టిన నివరధిక దీక్షా పోరాటానికి తన తోడ్పాటు ఉంటుందని అన్నారు. ఉద్యమం తీవ్రతరం కాకముందే సమస్య పరిష్కారానికిగాను ప్రభుత్వంతోపాటు పీ4 ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ సిహెచ్.కుటుంబరావు, హోంమంత్రి వంగలపూడి అనిత చొరవ తీసుకోవాలని కోరారు.
అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు మాట్లాడుతూ లక్షలాది అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందుతుందో, అర్థం కావడం లేదని అన్నారు. ప్రభుత్వ ఖాజానా నుంచి వంద రూపాయలు కూడా ఇవ్వమని అడగటంలేదని, అగ్రిగోల్డ్ ఏజెంట్లు, కస్టమర్ల సొమ్ముతో రూ.5లక్షల పెట్టుబడితో రూ.7,500 కోట్లకు ఎదిగి కూర్చున్న చెట్టుని తగలబెట్టిన కిరాతకులు అవ్వా వెంకట రామారావు సోదరులు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది కుటుంబాల బిడ్డల చదువులకు, పెళ్లిళ్లలకు, వ ద్ధాప్యంలో ఆరోగ్యానికి తోడ్పడతాయని నమ్మి సొమ్ము దాచుకుంటే ఇంతటి ఆర్థిక మోసానికి పాల్పడిన యాజమాన్యపు దొంగల సంగతి తేల్చుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించకపోతే అసోసియేషన్ అనుమతిచ్చి ఆమరణ దీక్షకు కూర్చుంటామని ఆవేశపూరితంగా ప్రసంగించారు.
అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి బి.చంద్రశేఖర్ వక్తలను వేదికపైకి ఆహ్వానిస్తూ సోమవారం నుంచి 4వ తేదీ వరకు రిలే దీక్షలు, 5వ తేదీ నుంచి జరిగే నిరవధిక దీక్షలు కొనసాగనున్నాయని, ఈలోగా ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనను ఉధ తం చేసేందుకు అసోసియేషన్ సిద్ధంగా ఉందన్నారు. తొలి రోజు దీక్షా శిబిరంలో ఒంగోలు, నెల్లూరు జిల్లాలకు చెందిన అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొన్నారు. అసోసియేషన్ నాయకులు రామదాసు, సుబ్రహ్మణ్యం, శంకరయ్య, వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *