గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం కలెక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ హాలులో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ వక్తృత్వ పోటీల ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా భారత్ వేదిక గా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం గా మేరా యువ భారత్ నిర్మాణానికి యువత తమ అభిప్రాయాలను జాతీయ యువ పార్లమెంట్ సదస్సులో ఎలుగెత్తి చాటిచెప్పడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా తోడ్పడుతుందన్నారు.
ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి ఆర్ జోత్స్నా కుమారి మాట్లాడుతూ ప్రభుత్వ మహిళా కళాశాల (స్వయం ), గుంటూరు ఆధ్వర్యంలో మార్చి 4వ తారీఖు జరిగే ఈ పోటీల్లో 18 నుండి 29 సంవత్సరాల వయస్సు వారు మై భారత్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ పోటీలలో పాల్గొని జాతీయస్థాయి యూత్ పార్లమెంట్లో పాల్గొనే అవకాశాన్ని పొందవచ్చు అన్నారు. .ఈ కార్యక్రమానికి సంబంధించిన ఇతర వివరాలు మై భారత్ పోర్టల్ లో ఉంటాయన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీమతి ఎం.సంతోష్ కుమారి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News