Breaking News

HPV వ్యాక్సిన్ ప్రారంభోత్సవం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ప్రకాశం రోడ్డు -1 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు గర్భాశయ మొక్క క్యాన్సర్ నివారణకు HPV టీకా కార్యక్రమాన్ని డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి చేతుల మీదుగా ప్రారంభించబడినది.
గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ కు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ చేపట్టిందని, అలాగే 14 ఏళ్ల వయసున్న అమ్మాయిలకు హెచ్పీవీ వైరస్ సోకకుండా ముందస్తు వ్యాక్సినేషన్ వేసేందుకు నేటి నుంచి ఏర్పాట్లు చేసిందని, జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్యంద్రాలోనూ అలాగే పట్టణ ఆరోగ్యంద్రాలోనూ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందనితెలియచేసినరు . జిల్లాలోని వైద్య సిబ్బంది అందరూ కూడా వారి పరిధిలో ఉన్నటువంటి 14 సంవత్సరంలో బాలికలు అందరికీ కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ తర్వాత ఈ వ్యాక్సిన్ వేయాలని ఏరోజుకారోజు జిల్లా కార్యాలయానికి రిపోర్ట్స్ ను పంపాలని డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు.
మహిళల జీవితాలను ఛిన్నాభిన్నం చేసే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముందు వరసలో ఉంటుందిని ,ఈ వ్యాధి బారిన పడకుండా జిల్లాలో ఇప్పటికే గుర్తించిన 14455 మంది 14 సంవత్సరముల బాలికలoదరికీ గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు HPV ( హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకా అందించటం జరుగుతుందని డాక్టర్ శాంత కుమారి జిల్లా ఇమినైజేషన్ అధికారి తెలియజేసినారు .సదురు కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మరియు సిబ్బంది పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *