Breaking News

తిరుపతిలో జిల్లా స్థాయి తనిఖీ కమిటీ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు, జాయింట్ కలెక్టర్ & అదనపు జిల్లా మేజిస్ట్రేట్ అధ్యక్షతన తిరుపతిలో జిల్లా స్థాయి తనిఖీ కమిటీ (District Level Inspection Committee) అధికారికంగా ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీ జువెనైల్ జస్టిస్ యాక్ట్ క్రింద రిజిస్టర్ చేయబడిన బాలల సంరక్షణ కేంద్రాలు తనిఖీ చేసి పిల్లల సంక్షేమం మరియు భద్రతను నిర్ధారించే పనిలో ఉన్న ఈ కమిటీ జిల్లా అంతటా ఉన్న పిల్లల సంరక్షణ సంస్థల (CCI) సమగ్ర తనిఖీలను నిర్వహించడం జరుగుతుంది. పిల్లల యొక్క ఆరోగ్య, మానసిక మరియు వారికీ ప్రభుత్వ పరంగా అందుతున్న సదుపాయాలు గురించి సమాచారము జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఫారం 46 – A ప్రకారము సేకరించి కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ వారికీ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ, గుంటూరు వారికీ నివేదించటం జరుగుతుందని తెలిపారు. ఆరోగ్యం & భద్రత – క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు మరియు సురక్షితమైన జీవన వాతావరణం కలిపించాలి అని తెలిపారు. ప్రతి బాలల సంరక్షణ కేంద్రాలు లలో CC కెమేరాలు వర్కింగ్ కండిషన్ లో ఉండేలా చూసుకోవాలి అని తెలిపారు. పిల్లలకు సురక్షితమైన తాగునీటిని అందించాలి అని తెలిపారు. మరుగుదొడ్ల శుభ్రం గా ఉండే విధంగ చూసుకోవాలి అని తెలిపారు
సంయుక్త కలెక్టర్/అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారు మాట్లాడుతూ, తనిఖీ బృందం నిస్పక్షపాతముగా తనిఖీలు చేసి ఎటువంటి లోపాలు ఉన్న సంబంధిత యజమానులకు తెలియచేసి వారు తప్పని సరిగా సరిదిద్దు కొనునట్లు తెలియచేయాలని తెలిపారు. నిర్ణిత గడువు లోపల ఈ తనిఖీలు పూర్తి అవ్వాలని తెలిపారు.
ఈ కార్యక్రమములో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని ఎస్. వసంత బాయి, బాలల సంక్షేమ సమితి సభ్యుడు పి. చంద్ర శేఖర్ రెడ్డి, డాక్టర్ సుకన్య (మెడికల్ ఆఫీసర్), డాక్టర్ పి. ఉదయ్ కిరణ్ (సైకియాట్రిస్ట్), జిల్లా బాలల సంక్షేమ అధికారి వి. శివ శంకర్, ప్రొటెక్షన్ ఆఫీస్ కె. కల్పన పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *