-ఏపి డైరీ డెవలప్ మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ బాబు.ఏ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న పాల వెల్లువ ప్రాజెక్టు పాడి రైతులకు జీవనోపాధిని కల్పించే ప్రాజెక్ట్ అని అందరూ సమన్వయంతో పనిచేసి ప్రగతిపథంలో నడిపించాలని ఏపి డైరీ డెవలప్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బాబు. ఏ అన్నారు.
స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధ్యక్షతన నిర్వహించిన జగనన్న పాల వెల్లువ జిల్లా స్థాయి కోర్ టీమ్ సమావేశంలో ఏపి డైరీ డెవలప్మెంట్ కోపరేటివ్ పెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బాబు. ఏ పాల్గొని జగనన్న పాల వెల్లువ ప్రాజెక్టు అమలు కార్యచరణ విధి విధానాలను, మార్గదర్శకాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్షుణ్ణంగా వివరించారు.
ఈ సందర్భంగా ఏపి డైరీ డెవలప్మెంట్ కోపరేటివ్ పెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బాబు, ఏ మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో 719 వైఎస్ఆర్ రైతుభరోసా కేంద్రాలు పరిధిలో 779 నివాసిత ప్రాంతాలు ఉన్నాయన్నారు. జగనన్న పాల వెల్లువ కింద జిల్లాలో తొలి విడతలో 300 గ్రామాల్లో పాల సేకరణ చేపట్టేందుకు అవసరమైన కార్యచరణ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇందుకు ముందస్తుగా జిల్లాలో పాల ఉత్పత్తిని అంచన వేయాలన్నారు. గ్రామ వాలంటీర్ల ద్వారా హౌస్ హోల్డ్ సర్వే నిర్వహించి పాడి పశువులను కలిగిన మహిళలను గుర్తించి వారి వివరాలను రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. పాల సేకరణకు సంబంధించి వారికి అవగహన పరిచేందుకు గ్రామ సభ నిర్వహించాలన్నారు. పాల సేకరణకు అవసరమైన రూట్, ఫంక్షనారీస్ మ్యాపింగ్ చేయాలన్నారు. కనీసం 18 ఏళు వయసు నిండిన సొంత పాడి పశువు కలిగిన వారిని గుర్తించాలన్నారు. ముందుగా మహిళ డయిరీ అసోసియేషన్ సెంటర్ను రిజిస్ట్రేషన్ చేసి వాటి పనితీరు ఆధారంగా 90 రోజుల తరువాత మహిళ డయిరీ సహకార సంఘంగా రిజిస్టర్ చేయాలన్నారు. ఈ ప్రాజెక్టులో పాలు పోసే వారందరికి ఎటువంటి హామి లేకుండానే వర్కింగ్ క్యాపిటల్ గా 30వేల రూపాయల వరకు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా పాలు పోసే రైతులకు గేదెలు మంజూరు చేయాల ని ఇందుకు ఎటువంటి హామి లేని రీతిలో రూ.1.70 లక్షలు వరకు అందించవచ్చునన్నారు. పాలు పోసే వారు మాత్రమే ప్రమోటర్స్ గా ఉండాలని ఆయన సూచించారు. జగనన్న పాల వెల్లువ మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో పూర్తి అవగాహన కలిగించాలన్నారు.
ఈ కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఇందులో డిఆర్డీఏ, పశుసంవర్ధక శాఖ, కోపరేటివ్ శాఖలకు సంబంధించి రెండు షిప్ట్ లో పనిచేసేందుకు సిబ్బందిని నియమించాలన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు, డా. కె మాధవిలత, ఎల్. శివశంకర్, కె. మోహన్ కుమార్, సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్, ఆర్డీవోలు భాజవలి, కె. రాజ్యలక్ష్మి, శ్రీనుకుమార్, జడ్పీ సిఇఓ సూర్యప్రకాష్, పశుసంవర్థక శాఖ జెడి విద్యాసాగర్, పంచాయతీ రాజ్ ఎస్ట్ వీరాస్వామి, డిఆర్‌డీఏ పీడి జె.సునీత, ద్వామా పిడి సూర్యనారాయణ, వ్యవసాయ శాఖ జెడిటి మోహన్ రావు, డిపివో జ్వోతి, కెడిసిసిటి కె. చంద్రశేఖర్, సహకార, పాడి పరిశ్రమ తదితర శాఖాధికారులు పాల్గొన్నారు.