విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అవినీతిని నిర్మూలించే దిశగా ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతలను నిర్వహించాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజరు వి.బ్రహ్మానంద రెడ్డి పిలుపునిచ్చారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం అవినీతికి వ్యతి రేకంగా నిర్వహిస్తున్న జాగురూకత వారోత్సవాలలో భాగంగా బిఆర్ టియస్ రోడ్డులో ఏర్పాటు చేసిన వాక్ థన్ (Walkathon) లో యూనియన్ బ్యాంకు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈసందర్భంగా చీఫ్ జనరల్ మేనేజరు వి. బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో ప్రజలకు బ్యాంకు లావాదేవీలు మీద అవగాహన పెంచే విధంగా అక్టోబరు 26 నుండి నవంబరు 1వ తేదీ వరకూ అన్ని యూనియన్ బ్యాంకులలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించామని ఈరోజు నిర్వహించిన వాక్ థన్ తో వారోత్సవాలు ముగిసాయని ఆయన అన్నారు. ప్రతీ ఒక్కరూ నీతిగా బాధ్యతలు నిర్వహిస్తూ దేశపురోభివృద్ధికి తోడ్పడాలని ఈదిశగా అవినీతికి వ్యతి రేకంగా ప్రతీ ఒక్కరూ పనిచేయాలని ఆయన అన్నారు. ఋణాల పంపిణీలో అవినీతి జరిగితే ఖాతాదారులు నిఘా విభాగం దృష్టికి తేవాలని, ఖాతాదారుల మొబైల్ కు వచ్చే ఓటిపి కోట్లు ఎ వరికీ పంపకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఖాతాదారులకు సేవలు అందించుటలో యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ముందంజలో ఉందని తమ బ్యాంకు సేవలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని బ్రహ్మానంద రెడ్డి అన్నారు. ఈవాక్ లో యూనియన్ బ్యాంకు జోన్ కు చెందిన సుమారు 200 మంది బ్యాంకు అధికారులు సిబ్బంది పాల్గొని అవినీతికి వ్యతి రేకంగా నినాదాలు చేశారు. ఈకార్యక్రమంలో డిప్యూటి జనరల్ మేనేజరు కె. శ్రీనివాస రెడ్డి, డిప్యూటి రీజనల్ మేనేజరు సిహెచ్. సుందర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు, బ్యాంకు మేనేజర్లు, విజిలెన్స్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …