అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దీపం పరబ్రహ్మ స్వరూపం. అంధకారం నుంచి వెలుగు వైపు నడిపించేది దీపం అని భావిస్తాం. అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్ఠాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకొనే ఈ పండుగ తరుణాన నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ప్రకృతి వైపరీత్యాలు, మతి తప్పిన పాలకుల దాష్టీకాల నుంచి ప్రజలను రక్షించాలని ఈ దివ్వెల పండుగ సందర్భాన ఆ ఆదిశక్తిని ప్రార్థిస్తున్నాను. పర్యావరణానికి నష్టం కలిగించకుండా ఈ దీపాల పండుగను జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. కాంతులను వెదజల్లే దీపాలు, విద్యుల్లతలతో ఇళ్లను అలంకరించుకుందాం. ఎక్కువ హానికరం కానీ మందుగుండు సామగ్రితో దీపావళిని జరుపుకోవడం సర్వదా శ్రేయస్కరం. కంటికి హాని చేసే క్రాకర్లకు దూరంగా ఉందాం. ముఖ్యంగా పిల్లలను దూరంగా ఉంచండి. ఈ దీపావళిని ఆనందకేళిగా మలచుకోమని హృదయపూర్వకంగా కోరుతున్నాను అని ఓ ప్రకటనలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ తెలియజేశారు.
Tags AMARAVARTHI
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …