Breaking News

భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దీపం పరబ్రహ్మ స్వరూపం. అంధకారం నుంచి వెలుగు వైపు నడిపించేది దీపం అని భావిస్తాం. అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్ఠాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకొనే ఈ పండుగ తరుణాన నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ప్రకృతి వైపరీత్యాలు, మతి తప్పిన పాలకుల దాష్టీకాల నుంచి ప్రజలను రక్షించాలని ఈ దివ్వెల పండుగ సందర్భాన ఆ ఆదిశక్తిని ప్రార్థిస్తున్నాను. పర్యావరణానికి నష్టం కలిగించకుండా ఈ దీపాల పండుగను జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. కాంతులను వెదజల్లే దీపాలు, విద్యుల్లతలతో ఇళ్లను అలంకరించుకుందాం. ఎక్కువ హానికరం కానీ మందుగుండు సామగ్రితో దీపావళిని జరుపుకోవడం సర్వదా శ్రేయస్కరం. కంటికి హాని చేసే క్రాకర్లకు దూరంగా ఉందాం. ముఖ్యంగా పిల్లలను దూరంగా ఉంచండి. ఈ దీపావళిని ఆనందకేళిగా మలచుకోమని హృదయపూర్వకంగా కోరుతున్నాను అని ఓ ప్రకటనలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్  తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు

-భక్తితో పాటు బాధ్యతగా వినాయక చవితి జరుపుకుందాం. -వినాయక పందిళ్లకు ఉచిత విద్యుత్తుపై మంత్రి హర్షం అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *