Breaking News

సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో ఓట్ల లెక్కింపు కొనసాగేందుకు అన్నిఏర్పాట్లు పూర్తి చేశాం..

-జెడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన …
-జెడ్పీ సీఈవో సూర్యప్రకాశరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 3 జడ్పీటీసీ 7 ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఎన్నికల నియమావళి అనుసరిస్తూ భాద్యతాయుతంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా పరిషత్ సీఈవో సూర్యప్రకాశరావు అన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా ఈనెల 18 వ తేదీ గురువారం నిర్వహించే కౌంటింగ్ ఏర్పాట్లు పై బుధవారం మైలవరం లక్కిరెడ్డి లక్ష్మీరెడ్డి ఇండోర్ స్టేడియం, మైలవరం ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటరును జెడ్పీ సీఈవో సూర్యప్రకాశరావు పరిశీలించి అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 16 వ తేదీన నిర్వహించిన 3 జెడ్పీటీసీ స్థానాలకు, 7 ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఆయా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించడం జరుగుతుందన్నారు. పెడన జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు బొడ్డు నాగయ్య ప్రభుత్వం జూనియర్ కళాశాల,పెడనలోను, జి.కొండూరు జెడ్పీటీసీ కౌంటింగ్ లక్కిరెడ్డి లక్ష్మీరెడ్డి ఇండోర్ స్టేడియం, మైలవరం లోనూ, విసన్నపేట జెడ్పీటీసీ కౌంటింగ్ జెడ్పీ ఉన్నతపాఠశాల, విసన్నపేట నందు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఎంపీటీసీ స్థానాలకు సంబందించి పెనుగంచిప్రోలు మండలం కొనకంచి ముదినేపల్లిమండలం ముదినేపల్లి-2, వణుదుర్రు, నూజీవీడు మండలం దేవరగుంట, నాగాయలంక పర్రచివర, ఆగిరిపల్లి మండలం ఈదర-1, గన్నవరం మండలం చినఅవుటపల్లి ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆయా మండల పరిషత్ అభివృద్ది కార్యాలయాల్లో జరుగుతుందని వెల్లడించారు.

Check Also

ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ఛాంబర్స్ ఆఫ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *