విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలల్లో భాగంగా బుధవారం స్థానిక ఠాగూర్ గ్రంధాలయం లో ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్స్ కాన్ఫెడరేషన్,గీత గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో 150 మంది విద్యార్థులతో దేశభక్తి గీతాలు,నృత్యాలు,భరతనాట్యం,వ్యాసరచన ,డ్రాయింగ్ ,డిబేట్ మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు AISCCON పాటర్న్ మెంబెర్ డా,,జి. వి.వి.ఉమామహేశ్వర రావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిధులుగా పాల్గొన్న కృష్ణ జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ కంచల నాగరాజు,ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృత పాలకమండలి సభ్యులు కప్పగంతుల రామకృష్ణ ,భవానిపురం నేతాజీ స్కూల్ కరస్పాండెంట్ కందుల తిరుపతిరెడ్డి,గీత శర్మ,పొత్తూరి సీత రామారావు,డా,బందా వెంకట రామ రావు,నక్కినమాధావిలత, దయానిధి దాసు,హరి వేణుగోపాల్ తమ సందేశాలను ఇచ్చారు. మొటివెషనల్ స్పీకర్ మితింటి శారద పిల్లలు తాము నిర్ధేశించు కున్న గమ్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియచేశారు.కార్యక్రమాన్ని పొన్నూరు అమృత నిర్వహించారు.పిల్లలందరికీ బహుమతులు అంద చేసారు.
Tags vijayawada
Check Also
ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ …