-రాష్ట్ర అధ్యక్షులు పున్నం రాజు చేతుల మీదగా సీనియర్ పాత్రికేయులకు సన్మానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ “జాప్” 29 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కృష్ణా జిల్లా అధ్యక్షులు కోలా అజయ్, ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు పున్నం రాజు మాట్లాడుతూ జాప్ యూనియన్ 29 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం జిల్లా కమిటీ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అలాగే చరిత్రగల ఈ యూనియన్ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద యూనియన్ గా అవతరించిందని, యూనియన్ తరపున కృష్ణా జిల్లా కమిటీ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. కృష్ణా జిల్లా అధ్యక్షులు కోలా అజయ్ మరియు ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్ లు మాట్లాడుతూ పాత్రికేయ మిత్రులు ఎవరైనా ఏ విధమైన సమస్యలు ఎదురైనా యూనియన్లకు అతీతంగా మేము ఎప్పుడూ ముందు ఉంటామన్నారు. జర్నలిస్టులంతా ఐక్యం గా ఉంటూనే జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమ విజయానికి సహాయ సహకారాలు అందజేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సీనియర్ జర్నలిస్టు అయిన నేటి పత్రిక ప్రజావార్త ఎడిటర్ కొండూరి. శ్రీనివాసరావు, 6 టీవీ ఇంచార్జ్ ముకుంద గురునాథ్, ఆంధ్రప్రభ శ్యామ్, స్పీడ్ న్యూస్ ఎడిటర్ పోతిన వాసులను రాష్ట్ర అధ్యక్షులు పున్నం రాజు చేతుల మీదగా శాలువాతో సత్కరించి మెమెంటోలు అందజేసి సత్కరించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి జర్నలిస్టు కు మెమొంటో అందజేసి “జాప్” జర్నలిస్టులు అందరూ సమానమేనని, ఎవరు ఎక్కువ తక్కువ కాదని, అంతా ఒక కుటుంబమేనని నిరూపించింది. కార్యక్రమానంతరం చక్కటి ప్రేమ విందు ను జిల్లా కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.