విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అధికారుల ప్రోత్సాహం, ఉద్యోగుల సమస్యల పట్ల స్పందించే తీరు సమస్యల పరిష్కరించడంలో చూపిన చొరవ రాజుబాబు టీమ్ చెరగని ముద్ర వేశారని డిటిసి యం పురేంద్ర పేర్కొన్నారు. స్థానిక బందర్ రోడ్డులోని డిటిసి కార్యాలయంలో మంగళవారం నూతనంగా ఎన్నికైన రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్ 2 కార్యవర్గ సభ్యులు డిటిసి యం పురేంద్రను మర్యాదపూర్వకంగా కలిసి సంఘం జ్ఞాపికను అందించారు.
ఈ సందర్భంగా డిటిసి యం పురేంద్ర మాట్లాడుతూ పదవి అలంకారప్రాయం కాకుదని తనపై నమ్మకముతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఉద్యోగుల సమస్యలను మరింతగా పరిష్కరించేలాగా మరెంత చొరవ చూపాలన్నారు. సమస్యల పేరుతో ఉద్యోగులు విధులకు, రవాణాశాఖ అభివృద్ధికి ఆటంకం కలగకుండా ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అదే పనితీరును భవిష్యత్ లో కూడా ఉద్యోగులు కొనసాగించేలా చూడాలని అన్నారు. ఉద్యోగులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఉద్యోగులను సమైక్యతను చాటుతొందన్నారు.
సంఘం జోనల్ అధ్యక్షుడు యం రాజుబాబు మాట్లాడుతూ ఉద్యోగులకు ఏచిన్న సమస్య వచ్చిన పరిపాలనాపరమైన విధానాలతో పాటు మానవత దృక్పథంతో పదోన్నతులు, బదిలీల విషయాలలో ఉన్నత అధికారుల సహకారం మరువలేనిదన్నారు. అధికారుల ప్రోత్సాహం వలనే శాఖలోని ఉద్యోగులందరూ ఏకతాటిపై రవాణాశాఖ అభివృద్ధికి, నిర్దేశించిన లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తున్నారని ఆయన తెలిపారు.
డిటిసి ని కలిసిన వారిలో రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ కార్యదర్శి పి విజయ, కోశాధికారి కె.వి నాగమురళి, జోనల్ నాయకులు సిహెచ్ శ్రీనివాసరావు, పి కవిత, ఇతర ఉద్యోగులు ఉన్నారు.