మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళల ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని ఆడపిల్లలు బాగా చదువుకున్నప్పుడే అభి వృద్ధి సాధ్యమని రాష్ట్ర రవాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) నొక్కి వక్కాణించారు.
మంగళవారం ఉదయం శాసనసభ సమావేశాలకు హాజరయ్యేందుకు హడావిడిగా ప్రయాణమవుతూ సైతం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన నేరుగా కలుసుకున్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందుల గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే తక్షణ పరిష్కారం చూపించారు.
తొలుత స్థానిక రేవతి కూడలి ప్రాంతానికి చెందిన రేఖపల్లి బిందుశ్రీ అనే విద్యార్థిని తన తండ్రి కృష్ణప్రసాద్ తో వచ్చి మంత్రి పేర్నినానిను కలిసింది. తనకు ట్రిపిల్ ఐఐటి చదువుకోవాలని ఉందని ఆ సీట్ రాకపోవడంతో తప్పని స్థితిలోఇంటర్మీడియేట్ చేరాల్సివచ్చిందని తనకు ట్రిపిల్ ఐఐటి లో సీట్ వచ్చేలా సహాయం చేయమని మంత్రిని అభ్యర్ధించింది. ఈ విషయమై ఆయన స్పందిస్తూ, మెరిట్ ఆధారంగా ట్రిపుల్ ఐఐటి లో సీటు లభిస్తుందని, అలా కాకుండా దొడ్డిదారిన సీట్లు వస్తాయనే ఏ ఒక్కరి మాటలు నమ్మవద్దని మంత్రి ఆ బాలికకు హితవు పలికారు. సాంకేతిక విద్యలో అంతా పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని ఎవరి అనవసర జోక్యం ఆ భర్తీలో ఉండదన్నారు. ట్రిపిల్ ఐఐటి లో సీట్ వచ్చినా నీ మేధో మహిమ రాకపోయినా నీ మేధో మహిమేనన్నారు. ప్రస్తుతం చేరిన ఇంటర్మీడియట్ చేరావు కనుక బాగా చదువుకోవాలని నీకు చదువుకు అయ్యే ఖర్చు నేను భరిస్తా.. ఇంటర్ తర్వాత ఐఐటి సాధించమ్మా అని దీవించారు.
మచిలీపట్నం మండలం పెదపట్నం కానూరు నారాయణ పురం వంతెన సమీపం పొలంలో కొన్ని మడచెట్లు పొక్లైనర్ తో తొలగించి రొయ్యల చెరువు తవ్వే ప్రయత్నం చేశానని ఈలోపున తహశీల్ధార్ కార్యాలయ సిబ్బంది వచ్చి తన పొక్లెయినర్ ను సీజ్ చేశారని ఇప్పటికి నెల రోజులు దాటిందని విజయనగరం జిల్లా సాలూరు కు చెందిన పొక్లైనర్ యజమాని మంత్రి వద్ద చెప్పాడు. ఇక్కడికి నిన్ను వెళ్ళమని చెందేవారు ? నీకు పొక్లైనర్ ఉందని దొంగతనంగా దౌర్జన్యంగా ఎవరి పొలంలోనైనా చొరబడి చెరువు తవ్వేయడం పద్ధతేనా నీవు అలా అక్రమాలు చేస్తే, ప్రభుత్వం పోలీసులు నిన్ను నిలవరించకుండా చేతులు కట్టుకొని చూస్తూ ఊరుకోవాలా అని మంత్రి పేర్ని నాని గ్డధించారు. తనను యర్రంశెట్టి నాని అనే వ్యక్తి వెళ్ళమంటే వెళ్లానని బదులిచ్చాడు. వేరే వారి ఆస్తిలో చొరబడటం ధర్మమా అని ప్రశ్నించారు. నిన్ను అక్కడికి వెళ్లి చెరువు తవ్వమని చెప్పిన వ్యక్తి వద్దకు వెళ్లి నిలదీయాలని తన వద్దకు వస్తే , నిష్ప్రయోజనం అని మందలించారు.
స్థానిక రుస్తుంబాదకు చెందిన కొర్లపాటి నాగమణి అనే వృద్ధురాలు తన పింఛన్ ఆగిపోయిందని తన అడ్రెస్స్ లో హైదరాబాద్ పిన్ కోడ్ పొరబాటున ముద్రితమైందని తనకు తిరిగి పింఛన్ వచ్చేలా సహాయం చేయాలని మంత్రిని ఆమె అభ్యర్ధించింది.
పెదపట్నంకు చెందిన గరికముక్కు స్వాతి అనే మహిళ తనకు ఆరోగ్య సంబంధిత చికిత్స నిమిత్తం మందులకు ప్రతినెల కొంతమొత్తం ఇప్పించాలని మంత్రిని వేడుకొంది.
స్థానిక శారదానగర్ కు చెందిన శ్రీవిద్యా గ్రూప్ అని తమ ద్వాక్రా రుణం వచ్చేందుకు అనుకూలంగా సీఓ సంతకంపెట్టడం లేదని గత 25 రోజుల నుంచి ఆయన చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం కలగడం లేదని తమకు అలాహా బ్యాంకు సైతం రుణం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తుందని విజయరాణి అనే మహిళ మంత్రికి తెలిపింది.
Tags machilipatnam
Check Also
ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ …